Today June 24 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశులపై హనుమంతుడి ఆశీస్సులు ఉండడంతో ఊహించని లాభాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే వెళ్లకుండా ఉండడమే మంచిది. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కఠినంగా ఉండటమే మంచిది. కొన్ని ఆలోచనల కారణంగా మానసికంగా ఇబ్బందులు గురవుతారు. స్థిరాస్తి విషయంలో కీలక సమాచారం అందుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ప్రయాణాలు కలిసి రావచ్చు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. బడ్జెట్ కనుగొనంగా ఖర్చులు ఉంటాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈరోజు అదనంగా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ప్రయాణాలు ఈరోజు కలిసి వస్తాయి. అయితే సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు భాగస్వాములతో కలిసి చర్చిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొత్త ఇంటికి సంబంధించిన పనులు ప్రారంభిస్తారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ముందుకు వస్తారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సహనం అవసరం.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు వ్యాపారంపై సుదీర్ఘంగా చర్చిస్తారు. ఉద్యోగులు నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పిల్లల కెరీర్ సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారం నుంచి వచ్చే లాభాలు తగ్గిపోతాయి. ఓ చిన్న తప్పు వాళ్ళ కుటుంబంలో క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఉద్యోగులు బదిలీల విషయంలో ఆలోచిస్తారు. అదనంగా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు చర్యలకు సంబంధించి నూతనంగా ప్లాన్ చేస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. విహార యాత్రలకు వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ప్రాజెక్టుల ఆమోదం కోసం ఓపిక వహించాలి. కుటుంబంలో వ్యూహాత్మకమైన చర్చల ద్వారా ఇతరుల మనుషులను గెలుచుకుంటారు. సభ్యుల మధ్య సమన్వయం పాటించే విధంగా ప్రవర్తించాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వివిధ మార్గాల ద్వారా అదనపు ఆదాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. గృహ రుణాలు చెల్లిస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అయితే ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి వేధింపులు ఉండే అవకాశం ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా అధికారం నుంచి ప్రశంసలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రయాణం లాభాలను తీసుకొస్తుంది. వ్యాపారులు భాగస్వాములతో అభివృద్ధి గురించి చర్చిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు పూర్వికులు ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. అందువల్ల కొన్ని విషయాల్లో ఓపిక అవసరం. వ్యాపారులకు అదనపు బాధ్యతలు ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అనుకోని పనులు చేయడం వల్ల ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. పెట్టుబడిదారులు సరైన విధంగా లాభాలు పొందే అవకాశం ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి ఖర్చులు చేస్తారు.