https://oktelugu.com/

Horoscope Today : ఈరోజు జేష్ఠ పౌర్ణమి..ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..

Horoscope Today తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 21, 2024 / 08:20 AM IST

    Five Grahe horoscope

    Follow us on

    Horoscope Today: 2024 జూన్ 21 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా కొన్ని రాశుల వారికి శుభయోగాలు కలగనున్నాయి. పన్నెండు రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయంటే?..

    మేష రాశి:
    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. అధిక పని కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటారు.

    వృషభ రాశి:
    సమాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులకు దూరంగా ఉండాలి.

    మిథున రాశి:
    వ్యాపారంలో సానుకూల మార్పులు ఉంటాయి. ఉన్నత విద్యను అభ్యసించేవారు శుభవార్తలు వింటారు. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.

    కర్కాటక రాశి:
    కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.

    సింహారాశి:
    పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. పని కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రయోజనాలు పొందుతారు.

    కన్య రాశి:
    మాటలను అదుపులో ఉంచుకోవాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని విషయాలపై సంయమనం పాటించాలి.

    తుల రాశి:
    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోని అదృష్టం పెరుగుతుంది. ఆదాయం ఎక్కువగా రావడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి.

    వృశ్చిక రాశి:
    స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పాత బకాయిలు తీరుస్తారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.

    ధనస్సు రాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటుంబసభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపార అనుభవంతో కొన్ని ప్రణాళికలు విజయవంతం అవుతాయి.

    మకర రాశి:
    ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగు సమస్యల పరిష్కరిస్తారు.

    కుంభరాశి:
    తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని కారణాల వల్ల సమస్యలు ఎదురవుతాయి.

    మీనరాశి:
    కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.