Pan India Heroes: ఈ ఇద్దరు పాన్ ఇండియా హీరోల మార్కెట్ తగ్గడానికి కారణం ఏంటంటే..?

ఎంత బిజినెస్ జరుగుతుంది అనే దాని మీద వ్యాపార లెక్కలైతే ఆధారపడి ఉంటాయి. ఇక ఇలాంటి క్రమం లోనే స్టార్ డైరెక్టర్ కి నార్మల్ డైరెక్టర్ కి మధ్య ఉన్న తేడా మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : June 21, 2024 8:22 am

Pan India Heroes

Follow us on

Pan India Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయా లేదా అనే విషయాలను అబ్జర్వ్ చేసుకుంటూ తమ నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి అనే దాని మీద కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే వేసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాలను రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్న ఒక హీరో మాత్రం ఇప్పుడు చాలావరకు తన మార్కెట్ ను డౌన్ చేసుకుంటున్నాడు.

ఇక ఆయన ఎవరు అనేది తెలుసుకునే ముందు కేజీఎఫ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న యశ్ కూడా ఇప్పుడు చాలా వరకు తన మార్కెట్ ను కోల్పోయాడు. అయితే కేజిఎఫ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ ని అందుకున్నప్పటికీ ఈయన తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఈయన ఎవరో ఒక నార్మల్ డైరెక్టర్ తో మాత్రమే సినిమా చేస్తున్నాడు తప్ప పాన్ ఇండియా డైరెక్టర్లతో సినిమాలు చేసే అవకాశం అయితే రావడం లేదు. ఇక దానివల్ల ఆయన మార్కెట్ ని చాలా వరకు కోల్పోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత మళ్లీ స్టార్ డైరెక్టర్ తో కాకుండా నార్మల్ డైరెక్టర్ తో సినిమా చేసినట్టయితే మార్కెట్ అనేది చాలా వరకు తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఆ హీరో సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ తీసుకునేటప్పుడు ఆ హీరో మార్కెట్ ని, ఆ డైరెక్టర్ మార్కెట్ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ సినిమాని ఎంతకి కొనాలి.

ఎంత బిజినెస్ జరుగుతుంది అనే దాని మీద వ్యాపార లెక్కలైతే ఆధారపడి ఉంటాయి. ఇక ఇలాంటి క్రమం లోనే స్టార్ డైరెక్టర్ కి నార్మల్ డైరెక్టర్ కి మధ్య ఉన్న తేడా మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందనే చెప్పాలి..ఇక ఇదోలా ఉంటే ఇంతకు ముందు పైన చెప్పుకున్న తెలుగు హీరో ఎవరంటే నిఖిల్… హ్యాపిడేస్, స్వామిరారా, కార్తీకేయ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక నిఖిల్ ఆ సినిమా తర్వాత చేసిన 16 పేజెస్, స్పై లాంటి సినిమాలతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కావడం విశేషం… ఇక ఇందులో ‘కార్తికేయ 2’ సూపర్ సక్సెస్ అయినప్పటికీ మిగిలిన రెండు సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీని ద్వారా తను కూడా తన మార్కెట్ ను చాలా వరకు కోల్పోయాడనే చెప్పాలి. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన మార్కెట్ ను పెంచుకుంటాడా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది…