Prasanth Varma: ఒకేసారి రెండు సినిమాలు స్టార్ చేసిన ప్రశాంత్ వర్మ…ఆయన ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు…

ఇప్పటికే జై హనుమాన్ షూటింగ్ 50% కంప్లీట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మిగిలిన షూటింగ్ కూడా తొందర్లోనే కంప్లీట్ చేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : June 21, 2024 8:12 am

Prasanth Varma

Follow us on

Prasanth Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ చిత్రాలను చేసి మంచి గుర్తింపు ప్రసంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ఈయన జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఆయన ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టి మరోసారి తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈయన బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన రన్వీర్ సింగ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటు గతం లో చాలా వార్తలైతే వచ్చాయి. ఏమైందో తెలియదు గానీ ఆ ప్రాజెక్టు అయితే మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు మరొకసారి ఇంకో సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఒకేసారి జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తూనే మరొక సినిమాను కూడా స్టార్ట్ చేసి దాన్ని కూడా ఫినిష్ చేసే పనిలో ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఎవరితో ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అనే విషయాలు మాత్రం ఇంకా క్లారిటీగా తెలియట్లేదు. కానీ ఒకేసారి రెండు సినిమాలను చేసే విధంగా ప్రణాళికను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే జై హనుమాన్ షూటింగ్ 50% కంప్లీట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మిగిలిన షూటింగ్ కూడా తొందర్లోనే కంప్లీట్ చేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా కూడా హనుమాన్ సినిమా రేంజ్ లో సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మరో సినిమాని కూడా ఒక స్టార్ హీరో తో స్టార్ట్ చేసే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఒకే సారి ఇటు జై హనుమాన్, అటు స్టార్ హీరో సినిమాను షూట్ చేసే విధంగా ప్రణాళికలను రచిస్తున్నాడు. మరి ఆ స్టార్ హీరో ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదంతా తెలుసుకున్న ట్రేడ్ పండితులు ప్రశాంత్ వర్మ ఎందుకు అంత తొందర పడుతున్నాడు ఒక సినిమా తర్వాత మరొకటి చేయవచ్చు కదా అంటూ వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…