https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు ఈ రాశి ఉద్యోగులకు అన్నీ విజయాలే.. 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే?

కొన్ని సమస్యలు పరిష్కరించడం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. తల్లితో విభేదాలు వస్తాయి. ఉద్యోగులకు కొందరి నుంచి హాని ఏర్పడే ప్రమాదం ఉంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వారు కొత్త సమాచారం అందుకుంటారు. పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 6, 2024 / 07:42 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: శ్రావణమాసం రెండో రోజు ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ వ్రతం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి.. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక పవనాలు వీస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    వ్యాపారులకు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు ఏ పని చేయాలనుకున్నా విజయం వరిస్తుంది. బీమా వ్యాపారంతో సంబంధం ఉన్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. ఎవరితో ఎక్కువగా వాదనలు చేయొద్దు.

    వృషభ రాశి:
    ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. పిల్లల భవిష్యత్తు కు సంబంధించి కొంత సమాచారం అందుకుంటారు.

    మిథున రాశి:
    కొన్ని సమస్యలు పరిష్కరించడం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. తల్లితో విభేదాలు వస్తాయి. ఉద్యోగులకు కొందరి నుంచి హాని ఏర్పడే ప్రమాదం ఉంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వారు కొత్త సమాచారం అందుకుంటారు. పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

    కర్కాటక రాశి:
    ఉపాధ్యాయ రంగంలోని వారికి తోటి వారి మద్దతు ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సమాజ సేవకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. జీవిత భాగస్వామికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. లక్ష్యాలను పూర్తి చేయడంలో శ్రద్ధ చూపుతారు.

    సింహారాశి:
    కొత్త స్నేహం చేస్తారు. పాత స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపార అభివృద్ధికి దారులు పడతాయి. భవిష్యత్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. కొందరు మీ పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    కన్య రాశి:
    సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. ప్రియమైన వారి కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. మనసు ఆందోళనతో నిండి ఉంటుంది.

    తుల రాశి:
    వ్యాపారులు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో తోటివారి మద్దతు ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. తల్లిదండ్రులతో ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. భవిష్యత్ కు సంబంధించి విద్యార్థులు కీలక నిర్ణయం తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి.

    వృశ్చిక రాశి:
    వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. ఏదైనా వివాదాలు ఉంటే అవి నేటితో సమసిపోతాయి. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు చేసే పనుల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగానికి చెందిన వారు కీలక నిర్ణయం తీసుకుంటారు.

    ధనస్సు రాశి:
    పెండింగు పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎక్కువగా మాటలను వదలకంటి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పనిలో ఆటంకాలు సృష్టించేవారు పక్కనే ఉంటారు. కొత్త వ్యక్తులను నమ్మొద్దు. వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

    మకర రాశి:
    ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు లాభాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో తోటివారి మద్దతు ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారం చేసేవారికి బంధువుల నుంచి మద్దతు ఉంటుంది. కొత్త ప్రణాళికలు వేస్తారు.

    కుంభరాశి:
    స్నేహితులతో సరదాగా గడుపుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇతరుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. వ్యాపారులు పోటీని ఎదుర్కొంటారు.

    మీనరాశి:
    వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. జీవితా భాగస్వామితో వ్యాపారం చేయాలనుకుంటే అనుకూలిస్తుంది. ఉద్యోగులు కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.