https://oktelugu.com/

Chanakya Niti: ఈ లక్షణాలు ఉన్న అమ్మాయి జీవితంలోకి వస్తే.. వారు అదృష్టవంతులే..

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి వ్యక్తిలో స్వార్థాలు పెరిగిపోతున్నాయి. ఎవరి జీవితాన్ని వారే చూసుకుంటున్నారు. చివరికి తల్లిదండ్రులనే పట్టించుకోవడం లేదు. అలాంటిది కొందరు అమ్మాయిలు కుటుంబ సంబంధాలు అంటే చికాకుగా చూస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 6, 2024 / 08:10 AM IST

    Chanakya Niti

    Follow us on

    Chanakya Niti: అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రాన్ని బోధించడమే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన సలహాలు అందించాడు. ఒక వ్యక్తి తన జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించుకోవడానికి, తోటి వారితో సంతోషంగా ఉండడానికి చాణక్య నీతి సూత్రాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఈ విషయాలను గ్రహించిన చాలా మంది చాణక్య సూత్రాలను పాటిస్తూ వస్తున్నారు. కొందరు ఇప్పటికీ ఆయన చెప్పిన విషయాలను పాటించడం వల్ల వారి జీవితం సంతోషంగా మారిందని చెబుతూ ఉన్నారు. చాణక్యుడు ఒక వ్యక్తి సంతోషంగా ఉండడానికి ఇతరులతో ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. అలాగే తన వైవాహిక జీవితంలో ఎలా ఉండాలో పూర్వకాలంలోనే చెప్పాడు. ప్రతీ వ్యక్తి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి. వీటిలో పెళ్లికి ముందు ఒకటి.. పెళ్లయిన తరువాత మరొకటి.. పెళ్లయిన తరువాత ఎవరైనా కొన్ని విషయాల్లో లోంగిపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి జీవిత భాగస్వామి చెప్పిన పనులే చేయాల్సి వస్తుంది. అయితే అందమైన జీవిత భాగస్వామి దొరికితే ఆ వ్యక్వి జీవితం స్వర్గంలా కనిపిస్తుందని చెప్పాడు. కానీ అందమైన భార్య అనగానే రూపం అందం కాదు.. గుణవంతురాలై ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ప్రస్తుత కాలంలో అలాంటి అమ్మాయిలు చాలా అరుదు. కానీ అలాంటి వ్యక్తి తన జీవితంలోకి వస్తే పురుషుల జీవితాల్లో సంతోషం ఉండడమే కాకుండా ఐశ్వర్యం వర్దిల్లుతుందని చెప్పాడు. అయితే అలాంటి అమ్మాయి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మాయిలో చాణక్యుడు చెప్పిన కొన్ని లక్షణాలు ఉంటే చాలు.. ఆమె ఎలాంటిదో తెలుసుకోవచ్చని అంటారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉండాలంటే?

    ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి వ్యక్తిలో స్వార్థాలు పెరిగిపోతున్నాయి. ఎవరి జీవితాన్ని వారే చూసుకుంటున్నారు. చివరికి తల్లిదండ్రులనే పట్టించుకోవడం లేదు. అలాంటిది కొందరు అమ్మాయిలు కుటుంబ సంబంధాలు అంటే చికాకుగా చూస్తున్నారు. పెళ్లయిన తరువాత భర్త మాత్రమే తనతో ఉంటే చాలు.. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరూ దగ్గర ఉండాల్సిన అవసరం లేదని ఆలోచించేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి ఆ వ్యక్తి జీవితంలో వస్తే ఒక నరకమే. అలా కాకుండా సంబంధాలను పెంచుకుంటూ కుటుంబ సభ్యులకు విలువ ఇచ్చే అమ్మాయి ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే తన ఆనందానికి అడ్డు ఉండదు.

    ఇప్పుడున్న వారిలో కొందరికి అసూయ ఎక్కువగా ఉంటుంది. తన కంటే ఎదుటి వారు బాగా ఉండడం వల్ల ఓర్చుకోలేకపోతున్నారు. అలా కాకుండా పరిస్థితులను అర్థం చేసుకొని అన్ని విషయాలను గ్రహించే అమ్మాయి అయితే ఆ వ్యక్తి అదృష్టవంతుడే. ఇలాంటి వారు భర్త కష్టాల్లో ఉన్నా.. తనకు తోడుగా ఉంటుంది. దీంతో ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.

    ఉద్యోగం, వ్యాపారం చేసే కొందరు వ్యక్తులు ఇంటికి రాగానే కొందరు చిటీకి మాటికి గొడవలు చేస్తుంటారు. అలా కాకుండా వారికి ప్రశాంత వాతావరణంలో ఉంచే అమ్మాయి అయితే సదరు వ్యక్తులు ఎలాంటి దురలవాట్లకు పోకుండా ఉంటారు. లేకుంటే ఇతర వ్యసనాలకు పాల్పడి దుబారా ఖర్చలు చేస్తారు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అలా కాకుండా సంతోషంగా తన భర్తతో ఉండడం వల్ల మరో రోజు ఉత్సాహంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది.

    చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేయకుండా భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలనుకునే అమ్మాయి ఇంటికి ఆకర్షణగా ఉంటారు. ఇలాంటి వారు సంతోషంగా ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఆర్థికంగా లాభపడుతారు. అందువల్ల ఇటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయి ఎవరి జీవితంలోకి వస్తారో వారు అదృష్టవంతులే.