Today horoscope in Telugu ‘: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మరికొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషం తో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ఉల్లాసంగా ఉంటారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల విషయంలో బాధ్యతగా ఉండాలి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల పవనాలు వీస్తాయి. విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. అనవసర వివాదాల్లో తల దూర్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ముఖ్యమైన పనులు చేయాల్సి వస్తే కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారులకు అనుగుణంగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. కొత్త పరిచయాలు లాభం చేకూరుస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొన్ని పనులు ఉత్సాహంగా చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరకంగా ఈ రాశి వారు ఈ రోజు లక్కీ పర్సన్ గా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కొన్ని పనులు న్యాయంగా చేయడం వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కొన్ని పనులు తెలివితేటలతో పూర్తి చేస్తారు. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఊహించని ప్రయాణాలు ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు. వాహనాలపై వెళ్లేవారు కేర్ తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపేవారు సూచనలు పాటించడం మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. దీంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పిల్లలకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని చేసుకోవడానికి పెద్దలను కలుస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆయా రంగాల వారు తమ విధులను బాధ్యతగా పూర్తి చేయాలి. లేకుంటే ఆర్థిక నష్టం చేకూరే అవకాశం. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండద్దు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండనుంది. ఉద్యోగులు సీనియర్లతో వాగ్వాదం చేయకూడదు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : సమాజంలో గౌరవ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఒక పనిని ప్రారంభించాల్సి వస్తుంది. దీనికి ఇతరుల సహాయం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండదు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కొన్ని పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువ. కొత్త వారితో స్నేహం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలగాలి. వ్యాపారులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులు సీనియర్ల నుంచి వేధింపులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉండదు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.