Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశరాసులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సర్వార్థ సిద్ధయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఊహించని లాభాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా కొన్ని పరిస్థితులు మారిపోతాయి. అందువల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఎంతో వ్యాపారంలో రాణిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. బంధువులతో ఆర్థిక వ్యవహారాలు జరుపుతారు. కొన్ని నిర్ణయాల పట్ల జీవిత భాగస్వామి సలహా అవసరం.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : .ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగుంటుంది. అయితే ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. అందువల్ల దుబారా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆకస్మాత్తుగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువుల కోసం రుణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అయితే ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేయకపోవడంతో నిరాశతో ఉంటారు. వ్యాపారులు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు వ్యవహరించాలి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి నిర్లక్ష్యంగా ఉండదు. ఆత్మ విశ్వాసంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . సింహరాశి వారు గతంలో ఉన్న కోరికలను నెరవేర్చుకుంటారు. వీరికి బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఉద్యోగుల ఆదాయం కరణీయంగా పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అయితే సమయాన్ని వృధా చేయకుండా ఆదాయంపై దృష్టి పెట్టాలి. ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సురక్షితంగా వెళ్లాలి. సమాజంలో గుర్తింపు వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి తీవ్రమైన కృషి చేయాలి. ఉద్యోగులు తమ తెలివితేటలను ప్రదర్శించడంతో అధికారుల నుంచి మద్దతు పెరుగుతుంది. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి ఈ రోజు ఆదాయ వందనాలు పెరుగుతాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అయితే దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉత్సాహంగా ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపు రావడంతో కొన్ని లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అనువైన వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు అనేక మార్పులు చేసుకుంటారు. దీనివల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మెరుగైన లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. తెలివితేటలు ప్రదర్శించడంతో సమాజంలో గుర్తింపు వస్తుంది. చాకచక్యంతో కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . . ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు తమ పనులను పూర్తి చేయడానికి ఇతరుల మద్దతు కోరుతారు. ఉద్యోగులు ఎన్ని రోజులు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడతారు. విద్యార్థులు కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంబంధాలను ఏర్పరచుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణంతో గడుపుతారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కొత్తగా ఆదాయ వ నరులు సమకూరుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి బంధువుల సహాయం ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో బిజీగా మారుతారు. కొన్ని సవాలను అధిగమించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. అయితే ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండేందుకు ప్రయత్నం చేయాలి.