Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై శుక్రవారం శతభిష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు కొన్ని రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దీంతో ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. మరికొన్ని రాశుల వారు వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాష్ట్ర పలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో విభేదాలు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. అధికారులతో విభేదాలు ఉండొచ్చు అందువల్ల వారితో వాగ్వాదం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు మెరుగైన సంబంధాలు ఉంటాయి. తండ్రితో విభేదాలు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూల ఫలితాలు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా ఉంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : అధికారులతో ఉద్యోగుల వాగ్వాదం ఉంటుంది. వ్యాపారులు బిజీగా ఉంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కొత్త వ్యక్తుల పరిచయం లభిస్తాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఉద్యోగులు సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త వ్యక్తులను నమ్మొద్దు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు సీనియర్లతో వాగ్వాదం చేస్తారు. ఏ పని ప్రారంభించిన పూర్తయ్యే వరకు కష్టపడాలి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. సీనియర్ల నుంచి వేధింపులు ఉంటాయి. కుటుంబంలో కొనాలనుంచి విభేదాలు ఉంటాయి. వీటి పరిష్కారం కోసం కృషి చేస్తారు. అకారణంగా వివాదాల్లోకి తల దూర్చొద్దు. వ్యాపారాలు స్వల్ప లాభాలు పొందుతారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఏదైనా రిస్కు తీసుకోవాల్సి వస్తే ఇతరులను సలహా తీసుకోవాలి. సకాలంలో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని పనుల కారణంగా ప్రయాణాలు చేస్తారు. పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు అనుకోకుండా లాభాలు పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తపెట్టుబడులు పెడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ప్రతిభ కారణంగా ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. పెండింగ్ సమస్యలను పూర్తి చేస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు ఏ పని ప్రారంభించిన విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.