Today Horoscope
Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం వాదశరాశులపై ఆర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో బుధుడు శుక్రుడు కలిసి మీనరాశిలో ప్రయాణించడం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ కారణం వల్ల కొందరు వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. మరికొందరు ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు అడ్డంకులు సృష్టిస్తారు. అందువల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మద్దతు వ్యాపారాలు లాభాలు పొందుతారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. చట్టపరమైన చిక్కుల్లో పడతారు. దీంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణం లో గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. స్నేహితుడు కోసం డబ్బులు అరేంజ్ చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. దీంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణ నెలకొంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్తగా పెళ్లి చేసుకునే వారి మధ్య వివాదాలు ఉంటాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. అనవసరపు వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షల్లో పాల్గొంటారు. ఇందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాజు వారు ఈరోజు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఆందోళన వాతావరణం ఉంటుంది. అయితే వాటిని ఎదుర్కోవడానికి కాస్త ఓపిక వహించాలి. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులను పెట్టాలి. రాజకీయాల్లోని వారికి అనుకూలమైన వాతావరణ ఉంటుంది. కార్యాలయాల్లో కొందరు రహస్య శత్రువులు ఉంటారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవసరాలు తీసుకోవడానికి షాపింగ్ చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి ఉద్యోగులకు తోటి వారి సహాయం ఎక్కువగా ఉంటుంది. దీంతో లక్షాలను పూర్తి చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉండే పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులతో వాదన ఉంటే ఓపిక పట్టడమే మంచిది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రాజకీయ రంగాల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. వ్యాపారులు కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలమైన పనులు ఉంటాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక సేవలో ఎక్కువగా పాల్గొంటారు. మతపరమైన కార్యక్రమాల్లో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. అయితే ఇవి భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాలు ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఎలా ఉంటుంది. డబ్బు వివాహంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మి అప్పుగా ఇవ్వద్దు. పిల్లలను వాహనాలపై తిప్పేవారు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలతో కాస్త మనసు ప్రశాంతంగా మారుతుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఉద్యోగులు అయితే కార్యాలయాల్లో తమ తెలివితేటలతో అధికారులను ఆకట్టుకుంటారు. దీంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే వీరిని ఎదుర్కోవడానికి సరైన ప్రణాళిక వేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : విదేశాల్లో ఉండేవారు శుభవార్తలు వింటారు. ఏదైనా యాత్రకు వెళ్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం గురించి చర్చిస్తారు. వ్యాపారులు ఆకస్మికంగా లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కష్టం వృధా పోకుండా అనుకున్న పనిని సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. అయితే మాటలు మాధుర్యంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో వాదన ఉంటే మౌనంగా ఉండటమే మంచిది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అధికారుల సూచన మేరకు ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు పూర్తి అవుతాయి. అయితే కొందరు మాత్రం వివాదాల్లో చిక్కుకుంటారు. అనవసరపు గొడవల్లో తలదూర్చకుండా ఉండాలి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణంలో కొంత వాగ్వాదం కలుగుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు కలుగుతాయి.