‘Today horoscope in telugu ‘: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో భాగంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఏ రోజు అక్షయ తృతీయ కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు శుభయోగాలను పొందుతారు. నిరుద్యోగులు కొత్త ఆవ శాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగుల లక్ష్యాల వైపు వెళ్తారు. అధికారుల మద్దతుతో దీనిని పూర్తి చేస్తారు. ఫలితంగా ప్రశంశాలు పొందుతారు. జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా విహారయాత్రలు చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కష్టపడిన దానికి సరైన ఫలితం ఉంటుంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లల ఆరోగ్య విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని ఉండకూడదు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. శక్తి సామర్థ్యాలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు గతంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణము ఉంటుంది. విద్యార్థులు చదువుపై ఆసక్తి చెబుతారు. అయితే పోటీ పరీక్షలో పాల్గొనేవారు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారాలు ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెడితే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త వ్యక్తులతో జరపొద్దు. ప్రియమైన వ్యక్తికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులు మెరుగైన ఫలితాలను పొందుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. అయితే ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామికి విలువైన బహుమతి అందిస్తారు. స్నేహితులను కలవడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తగినంత డబ్బు ఉండడం వల్ల కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే పెద్దల సలహా తీసుకోవాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో పాదయాత్రలకు వెళ్తారు. కొత్త వారితో ఆర్థిక వివరాలు జరపొద్దు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు గతంలో ఒత్తిడిని ఎదుర్కొంటే నేటితో పరిష్కారం అవుతుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రియమైన వారితో మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇదే అనువైన సమయం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కష్టపడిన వారికి సాధ్యమైనంతవరకు ఫలితాలు అందుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం పెరిగిన దుబారకర్చులను నివారించాలి. జీవిత భాగస్వామిగా వాగ్వాదం ఉంటుంది.. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ప్రణాళిక ప్రకారంగా భాగస్వాములతో చర్చిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : నిరాశ వ్యాపారులు ఈరోజు అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితంలో గతంలో సమస్యలు ఉంటే వాటిని తొలగిస్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. దీంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు సంబంధాలను మెరుగుపరచుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా బిజీగా మారుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇందుకోసం పెద్దల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. అవసరమైన ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. స్నేహితుల ద్వారా ధన సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . మీరు రాశి వారికి ఈ రోజు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. అయితే ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.