Allu Arjun : గత ఏడాది డిసెంబర్ నెలలో సంధ్య థియేటర్(Sandhya Theatre) లో జరిగిన తొక్కిసిలాట ఘటన ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ ఘటన లో రేవతి అనే యువతీ చనిపోగా, శ్రీతేజ్(Sritej) కొనఊపిరి తో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇన్ని రోజులు కొట్టుకొచ్చాడు. అయితే నేడు శ్రీతేజ్ ఆరోగ్యంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యినట్టు తెలుస్తుంది. సుమారుగా 5 నెలల పాటు చావు తో పోరాడి గెలిచి వచ్చిన శ్రీతేజ్,రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపించారు. గత 15 రోజుల నుండి శ్రీతేజ్ నోటి ద్వారానే లిక్విడ్స్ తీసుకుంటున్నదని అతని తండ్రి చెప్పుకొచ్చాడు. ఆరోగ్యం స్థిరంగానే ఉన్నప్పటికీ మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాడని, త్వరలోనే ఆ సమస్య నుండి కూడా కోలుకుంటాడని ఆశిస్తున్నాము అంటూ ఆయన మీడియా తో చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు శ్రీతేజ్ సురక్షితంగా ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్లడంపై సోషల్ మీడియా లో సర్వత్రా హర్షిస్తున్నారు.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
ముఖ్యంగా అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. దేశాన్ని మొత్తం షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న తమ అభిమాన హీరో, ఎంజాయ్ చేయాల్సిన సమయంలో జైలులో గడపాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ నెల రోజులు మొత్తం పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయామని, ఇప్పుడు శ్రీతేజ్ కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. శ్రీతేజ్ ఇంత తొందరగా కోలుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత సహాయ సహకారాలు అందించిందో, అల్లు అర్జున్ కూడా అంతే సహాయ సహకారాలు అందించాడు. ఆ కుర్రాడికి ఎలాంటి కష్టమొచ్చినా దగ్గరుండి చూసుకుంటానని హామీ ఇవ్వడమే కాకుండా, ఆ అబ్బాయి భవిష్యత్తు కోసం రెండు కోట్ల రూపాయిలు ఫిక్సెడ్ డిపాజిట్ కూడా చేసాడు. శ్రీతేజ్ తొందరగా కోలుకోకుంటే, అతన్ని విదేశాలకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం కూడా చేసాడు అల్లు అర్జున్.
తొందరగా ఆ కుర్రాడు ఇంకా సంపూర్ణంగా కోలుకొని, తన తోటి పిల్లలు లాగానే ఆడుకుంటూ, చదువుకుంటూ ఉండాలని సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ కోరుకుంటున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఎదో ఒక సమయంలో తీరిక చూసుకొని అల్లు అర్జున్ ఈ కుర్రాడిని కలిసే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కుర్రాడు ఎంత తొందరగా కోలుకుంటాడు అనేది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ విదేశాల్లో ఉన్నాడు. ఆయన ఇండియా కి తిరిగి రాగానే అట్లీ తో చేయబోయే సినిమా వర్క్ షాప్ లో పాల్గొనే అవకాశం ఉంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో సాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. అల్లు అర్జున్ ఇందులో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?