Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై శుక్రవారం జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఏ రోజు గురుడు శుక్రుడు కలిసి మాలవ్య రాజయోగం ఏర్పరచనున్నారు. నీతో కొన్ని రాశుల వారికి అదనపు లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉండనున్నాయి. కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే అది విజయవంతంగా పూర్తి అవుతుంది. ఉద్యోగులు లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని పూర్తి చేస్తారు. దీంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చొద్దు. డబ్బు విషయంలో చాలా కష్టపడతారు. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు తోటివారి నుంచి వ్యతిరేకతను పొందుతారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ ఆదివారం ఈరోజు ఏ పని ప్రారంభించిన ప్రయోజనకరంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కాస్త ఆందోళనగా ఉంటారు. సమయాన్ని వృధా చేయకుండా పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలి. ఉద్యోగులు కొత్తగా బాధ్యతలను చేపడతారు. వీటిని విస్మరించకుండా లక్ష్యాలను పూర్తిచేయాలి. కొత్త వారితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన కారణంగా ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులు తోటి వారితో ఇబ్బందులకు గురవుతారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి అనుమతి లేనిదే ఇంట్లో ఏ పని చేయరాదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారాలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల కెరియర్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెడితే ఇదే మంచి అవకాశం. వ్యాపారులు బిజీగా కనిపిస్తారు. విద్యార్థులతో కలిసి మెలిసి ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . మీ రాశి వారు ఈ రోజు ఏ పని చేపట్టిన సులభంగా పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది
ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలకు ప్రభావం కావొద్దు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీ రు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అనుకోకుండా బదిలీ అవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాజు వారు ఈరోజు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. రోజు వారి పనుల్లో కొన్ని పెండింగ్ పడతాయి. గతంలో చేపట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటాయి. మాటలు కంటే మౌనంగా ఉండటమే మంచిది. కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టిన పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉంటాయి. అయితే మానసికంగా ఆందోళనగా ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. హలో సర్కు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం వచ్చిన ఎక్కువగా నిలవకుండా ఉంటుంది. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు ఎక్కువగా మానసికంగా ఆందోళనతో ఉంటారు. పెండింగ్ బిల్లులను పూర్తి చేయాలి. గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కొత్త భాగస్వాములతో చర్చిస్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి. డబ్బు కోసం తప్పుడు పనులను చేయవద్దు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . మీ రాశి వారు ఈరోజు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్స్ ఇస్తారు. దూరప్రాయాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు అధిక ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థుల కెరీర్ పై దృష్టిపెట్టాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారు ఈరోజు మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రశంశాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత ఉండాలి. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల నుంచి రుణ సహాయం పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . మీ రాశి వ్యాపారాలు ఈరోజు అధికంగా లాభాలు పొందుతారు. వినోదం కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. కొత్తగా భాగస్వాములు చేరితే వారితో ఆర్థిక లావాదేవీలు ఆలోచించాలి. విద్యార్థులు కెరీర్ పై ఫోకస్ పెడతారు.