Homeఆధ్యాత్మికంToday Horoscope In Telugu: ఈ రాశుల ఉద్యోగులు ఈరోజు అదృష్టవంతులు.. ఎందుకంటే?

Today Horoscope In Telugu: ఈ రాశుల ఉద్యోగులు ఈరోజు అదృష్టవంతులు.. ఎందుకంటే?

Today Horoscope In Telugu: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో సింహం, మకరం సహా కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండలున్నాయి. మరికొన్ని రాశుల ఉద్యోగులు అధిక ప్రయోజనాలు పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే వ్యాపారులకు ఆకస్మిక ఆదాయం వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడతాయి. కొత్తగా వస్తువులు కొనుగోలు చేసేవారు కొన్ని రోజులు వెయిట్ చేయాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు అనుకోని లాభాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సొంత వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. జీవనోపాధి కోసం ఎదురుచూసేవారు శుభవార్తలు వింటారు. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కొన్ని కార్యకలాపాల ద్వారా బిజీగా మారుతారు. వైవాహిక జీవితం సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగులు తమ విధులను శ్రద్ధగా నిర్వర్తిస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోతారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే అందులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యయాలు చేయాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. విహార యాత్రలకు వెళ్లాలని అనుకునేవారు ప్లాన్ వేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్తవారితో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. గతంలో చేపట్టిన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటిస్తారు. పాత పనులు పూర్తి చేయడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులు బాధ్యతలను చేపడతారు. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి పూర్తి మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఇంట్లోకి అతిధి రావడంతో సందడిగా మారుతుంది. కొన్ని పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. దీంతో అదనంగా డబ్బు వస్తుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆదాయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పనిని ప్రారంభిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో పురోగతి సాధించే అవకాశం. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టాన్ని కలిగే అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆర్థికంగా స్థిరపడతారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండొద్దు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. సోదరుల సపోర్టుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో జీతం పెరిగే అవకాశం ఉంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అన్నీ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఖర్చులు పెరిగిన ఆదాయం పెరగడంతో ఇబ్బందులు తొలగిపోతాయి. కార్యాలయంలో ఈ రాశి వారి కృషి వలన కొన్ని ప్రాజెక్టులు సక్సెస్ గా పూర్తవుతాయి. దీంతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అందరికీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో వివాదాలు ఏర్పడితే మాటలను అదుపులో ఉంచుకోవాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు చేసిన కొన్ని ప్రయత్నాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. సోదరుల మద్దతు ఉండడంతో వ్యాపారులు కొత్తపెట్టుబడులు పెడతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదాయం పొందుతారు. విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రజల పట్ల మద్దతు పెరిగి అనేక సేవలు చేయగలుగుతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ఇప్పటివరకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడతారు. ఆదాయం మెరుగుపడుతుంది. దేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార పర్యటనలు విజయవంతంగా పూర్తి అవుతాయి. సొంతంగా వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular