Balayya and Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తుంటారు. ఇక నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు (Balayya Babu)సైతం భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలయ్య బాబు భారీ సినిమాలను చేస్తూ మాస్ హీరోగా పేరు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక వెంకటేష్ (Venkatesh) లాంటి హీరో సైతం ఫ్యామిలీ సినిమాలను చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా నేపధ్యంలో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో చేయాల్సిన ఒక సినిమాను విక్టరీ వెంకటేష్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడనే విషయం చాలామందికి తెలియదు. బి.గోపాల్ డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘బొబ్బిలి రాజా’ సినిమాని మొదట బాలయ్య చేయాలని అనుకున్నారట.
Also Read : వెంకటేష్, ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా!
కానీ ఆయన వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాని చేయలేకపోయాడు. దాంతో రామానాయుడు దగ్గరికి ఆ కథ వెళ్లడం అది ఆయనకి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా వెంకటేష్ తో చేద్దామని బి గోపాల్ తో చెప్పి సినిమాను చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ తో వెంకటేష్ ఓవర్ నైట్ లో మాస్ హీరోగా మారిపోయాడు.
ఇక అప్పటివరకు క్లాస్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ వచ్చిన వెంకటేష్ ఒక్కసారిగా మాస్ ఇమేజ్ రావడంతో అన్ని రకాల సినిమాలను చేయడానికి వెంకటేష్ సిద్ధంగా ఉన్నాడు అంటూ పలు రకాల దర్శకులు మంచి కథలతో వెంకటేష్ దగ్గరికి వెళ్లి ఆయనతో కొన్ని సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నారు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వెంకటేష్ మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…
ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthi Vastunnam) ఒక ఫ్యామిలీ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని సీనియర్ హీరోలందరి కంటే కూడా భారీ రికార్డులను కొల్లగొడుతూ 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు…ఇక ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకోవాలని స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేయాలని ఉద్దేశ్యంలో వెంకటేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తొందర్లోనే రాబోతున్న సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు…
Also Read : బాలయ్య ఎక్కడయ్యా?.. ఏకంగా అక్కడ ఫిర్యాదులు!