Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదేరోజు కామద ఏకాదశి ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టాలు జరిగే అవకాశం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అర్హులైన వారికి వివాహాలు ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆలోచ నాత్మకంగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు ప్రణాళికలు వేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ధాన్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఆరోగ్యదృష్ట ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలి. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు గంధర గోల పరిస్థితులు ఎదురవుతాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారులు అనుకున్న విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో ఉద్యోగులు సైతం అధిక ఆదాయాన్ని పొందుతారు. అయితే కార్యాలయాల్లో అధికారుల నుంచి వేధింపులు తట్టుకునే ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లే వారికి విజయాలు వర్తిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. దీంతో అదనపు ఆదాయం కూడా పెరుగుతుంది. అధికారులతో సత్సంబాలు నెలకొంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు కాస్త ఆందోళన వాతావరణం లో ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యక్తిగత పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. అయితే కుటుంబం కోసం చేసే పనులు కష్టతరంగా మారుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు చేసే ప్రణాళికలు లాభ స్థాయి. ఉద్యోగం మారేవారికి ఇదే మంచి అవకాశం. రాజకీయ నాయకులకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్తగా వాహనాన్ని కొనడం లేదా వస్తువులను కొనడం సరైన సమయం. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేయడం మంచిది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . సామాజిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. దీంతో ప్రజల నుంచి మద్దతు ఎక్కువగా ఉంటుంది. ప్రజా సంబంధాలు మెరుగుపడడంతో కొన్ని పనులు ఈజీగా పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను ఇప్పుడు మొదలు పెడతారు. జీవిత భాగస్వామితో చేసే వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగులు లక్షల కోసం తీవ్రంగా శ్రమిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు నడవాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కోరికలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అయినా ముందుకు వెళ్లాలి. మాటల మాధుర్యంతోనే ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారాలు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. బాధ్యతాయుతమైన పనుల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంశ లు పొందినా .. కొన్ని విషయాల్లో ఒత్తిడి ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూల ఫలితాలు ఉండాలు ఉన్నాయి. ఉద్యోగుల ఆశలు నెరవేరుతాయి. వ్యాపారులకు వివిధ మార్గాల నుండి డబ్బు సమకూరుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. కుటుంబ సభ్యులలో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. అయితే సోదరుల మద్దతుతో సమస్య పరిష్కారం అవుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే అనుకోకుండా ఖర్చులు పెరగడంతో నిరుత్సాహం చెందుతారు. ఆదాయం పెంచుకునే మార్గం వెతుకుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం కోసం కొన్ని సమాచారాలు అందుకుంటారు. ఇతరుల వద్ద రుణం తీసుకునేటప్పుడు ఆలోచించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఎవరితోనైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. వారితో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఒకరికొకరు సాయపడడానికి ముందుకు వస్తారు. దీంతో వ్యాపారులు విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.