Today Horoscope In Telugu (4)
Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో మీనరాశిలో చంద్రుడు సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభయోగాలు జరగనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు తల్లిదండ్రులు సలహా తీసుకోవాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : మీ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వార్తలు మనసుకు ఆందోళన కలిగిస్తాయి. ఇతరులకు డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. బంధువుల్లో ఒకరి కారణంగా ఆందోళన కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండే అవకాశం. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. విహార యాత్రలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త వనరులను సమకూర్చుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. అయితే ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్తగా పెట్టుబడును పెడతారు. స్నేహితులతో కలిసి ఉయ్యాల యాత్రలకు వెళ్తారు. ఉద్యోగుల లక్ష్యాలను పూర్తి చేయడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. శత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. వ్యాపారులు ఆర్థికంగా లాభాలను పొందుతారు. తల్లిదండ్రుల తో వాగ్వాదం ఉండే అవకాశం ఉంటుంది. అయితే మాటల మాధుర్యంతో సమస్యను పరిష్కరించుకుంటారు. వీఆర్ యాత్రలకు వెళ్లాలని అనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రస్తుతం ప్రయాణాలకు అనుకూల సమయం కాదు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. విహారయాత్రలకు వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో కలహాలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా పని చేయాలి. ఏ చిన్న ఇబ్బందులు కలిగిన వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఇప్పుడు పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో లాభాలను పొందుతారు. ఉద్యోగులు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కొన్ని పనులు పూర్తి కావడానికి కష్టపడాల్సి వస్తుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా విషయాలు అనుకూల వాతావరణం ఉంటుంది. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సివస్తే అనుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. చట్టపరమైన చిక్కులు ఏరుకుంటే నీటితో పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మద్దతుగా ఉండాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి ఒక సమాచారం కలవరపడుతుంది. వ్యాపారులు లాభాలను పొందలేక పోతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే పెద్దల సలహా తీసుకోవాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంలో వివాదాలు ఎదుర్కొంటారు. మానసిక ఆందోళనతో ఇబ్బందులకు గురవుతారు. వెళ్లాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఉద్యోగులు నిర్ణయం తీసుకునేటప్పుడు తోటి వారి సలహా తీసుకోవడం మంచిది. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టిస్తారు. జీవిత భాగస్వామి మద్దతుతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈరోజు ప్రోత్సాహకరమైన వార్తలను వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్తు కోసం ఇప్పుడు పెట్టే పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తిచేయాలనుకుంటే పెద్దల సలహా తీసుకోవాలి. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి