GT Vs MI
GT Vs MI: ముంబై ఇండియన్స్ జట్టు మాజీ కెప్టెన్, కీలక ఆటగాడు రోహిత్ శర్మకు హిట్ మ్యాన్ అనే బిరుదుంది. ఎందుకంటే అతడు ఎలాంటి పరిస్థితిలోనైనా ఆడతాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. కసి కొద్ది ఫోర్లు.. ఇష్టానుసారంగా సిక్సర్లు కొడతాడు. అతడిదైన రోజు మాత్రమే కాదు.. అతడిది కాని రోజు కూడా దుమ్మురేపుతాడు. అందువల్లే అతడిని టీమ్ ఇండియా తరఫున హిట్ మ్యాన్ అంటారు. ఇక ఐపీఎల్ లోను రోహిత్ శర్మకు తిరుగులేదు. ఎందుకంటే అతడు ఆడిన ఇన్నింగ్స్ అటువంటివి. గత సీజన్లో కెప్టెన్సీ నుంచి అతడిని ముంబై జట్టు యాజమాన్యం పక్కన పెట్టినప్పటికీ.. రోహిత్ చెప్పుకోదగ్గ ఇన్నించాడాడు… కాకపోతే ముంబై ఇండియన్స్ జట్టు గత సీజన్లో ఆశించినంత ఆట తీరు ప్రదర్శించలేదు. ఫలితంగా గ్రూప్ దశ నుంచే ఆ జట్టు నిష్క్రమించింది.. ప్రస్తుత సీజన్లో రోహిత్ శర్మ ఆట తీరు పెద్దగా మారినట్టు కనిపించడం లేదు. చెన్నై జట్టు మ్యాచ్లో 0 పరుగులకు ఒకటైన రోహిత్.. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు.
సిరాజ్ వికెట్ పడగొట్టాడు..
197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు మెరుగైన ఆరంభం అందించాలని ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ భావించారు. ఇందులో భాగంగానే రోహిత్ రెండు ఫోర్లు కొట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఇక ఇదే సమయంలో మహమ్మద్ సిరాజ్ తక్కువ ఎత్తులో బంతిని విసరడంతో.. రోహిత్ శర్మ దాని గమనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో ఆ బంతి నేరుగా వికెట్లను పడగొట్టింది. ఈ పరిణామాన్ని ఊహించని రోహిత్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. రోహిత్ వికెట్ పడడమే ఆలస్యం మైదానంలో ప్రేక్షకులు ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. రోహిత్ కూడా ఆ బంతిని అంచనా వేయలేకపోవడంతో షాక్ కు గురయ్యాడు. అత్యంత నిరాశతో మైదానాన్ని వీడాడు. చెన్నై జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లోను రోహిత్ సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే అతడు అలా అవుట్ కావడం పట్ల సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టారు కాబట్టి.. రోహిత్ శర్మ ముంబై యాజమాన్యంపై ఇంకా ఆగ్రహం గానే ఉన్నాడని.. అందువల్లే ఇలా అవుట్ అవుతున్నాడని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే వాటిని రోహిత్ అభిమానులు కొట్టి పడేశారు. రోహిత్ శర్మకు అలాంటి వ్యవహార శైలి ఉండదని.. అతడు జట్టు కోసం మాత్రమే ఆడతాడని.. వ్యక్తిగత రికార్డులను ఏమాత్రం పట్టించుకోవడానికి రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. అయితే 8 పరుగులకే రోహిత్ అవుట్ కావడానికి అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.