‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాశులపై పూర్వాభాద్ర పద నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు గజకేసరి యోగం ఏర్పడడంతో కొన్ని రాశులపై మహావిష్ణువు అనుగ్రహం ఉండనుంది. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. మానసికంగా ఆందోళనలతో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి. మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా చూడాలి. వ్యాపారులు లాభాలు పొందుతారు. పిల్లలతో సరదాగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాటి పరిష్కారానికి తగిన సమయం కేటాయించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో ఉన్న మానసిక బాధల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. వ్యాపారులకు కొందరు ప్రత్యర్థులు అడ్డు తలుగుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏదైనా గొడవ ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. కొత్త వాహనం కొరుగోలు చేయాల్సివస్తే ఆలోచించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. అయితే విజయం సాధించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉండగలుగుతారు. ఈరోజు డబ్బు ఎవరికి అప్పు ఇవ్వకుండా చూడాలి. ఎందుకంటే అది తిరిగి రావడానికి కష్టంగా మారుతుంది కుటుంబంలో ఒకరు మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. ఈ భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. ఏవైనా వివాదం జరిగితే వెంటనే పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. అనుకోకుండా స్నేహితులతో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండే అవకాశం ఉంది. కొందరు ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. సామాజిక రంగాల్లో పాల్గొనే వారికి గౌరవం లభిస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ఏ చిన్న నిర్లక్ష్యంగా ఉన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంలో ముందుంటారు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు ఏ సమయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే అది పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు బంధువులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం కావడంతో మానసికంగా సంతృప్తి చెందుతారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడానికి ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. ఒకరి ప్రభావంతో పెట్టుబడులు పెట్టగలుగుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్యంపై ఏ చిన్న నిర్లక్ష్యం చేసిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంలో విజయం సాధించగలుగుతారు. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో బాగా ఆలోచించాలి.