Big Warning to AP : తెలుగు రాష్ట్రాలకు( Telugu States ) భారత వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రానున్న మూడు రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాబోయే 12 గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని కూడా తెలిపింది. దీని ప్రభావం కూడా రెండు తెలుగు రాష్ట్రాల పై ఉండబోతుందని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు( temperatures ) కూడా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వరకు భారీగా ఎండలు ఉంటున్నాయి. సాయంత్రానికి మేఘావృత్తమై వర్షాలు పడుతున్నాయి. పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైయస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయని చెబుతోంది వాతావరణ శాఖ.
Also Read : ఆ నాలుగు జిల్లాల్లో హై అలెర్ట్ .. బయటకు రావద్దు.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక!
* ఉత్తరాదిలో భారీ వర్షాలు..
మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో( North States) భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. కాశ్మీర్ నుంచి మధ్యప్రదేశ్ వరకు వర్షాలు భారీగా పడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా వర్షాలు నమోదు అవుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్ల వాన పడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో భారీ వర్షాలు నమోదయ్యాయి. వర్షాకాలం ప్రారంభం అయినట్టే. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది భారీ వర్షాలు నమోదయ్యాయి కర్ణాటకలో. తమిళనాడులో సైతం భారీ వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది కూడా పరిస్థితి అలానే ఉంది.
* చురుగ్గా రుతుపవనాలు..
మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. జూన్ మొదటి వారానికి( June 1st week ) దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. అండమాన్ నికోబార్ దీవులకు ఈనెల 13న రుతుపవనాలు తాకాయి. ఈనెల 27 నాటికి కేరళకు దాఖలు ఉన్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఉపరితల ఆవర్తనాలు, తుపానులు సంభవించడానికి అనుకూలంగా మారింది. అందుకే ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.