Today Horoscope In Telugu (5)
Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశరాశులపై బుధవారం విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలయికతో కొన్ని రాశుల వారికి విశేషం ఫలితాలు కలగనున్నాయి. మరికొన్ని రాసిన వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది.. అయితే మాటలను అదుపులో అనుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని మార్పులు చేయాలని అనుకుంటారు. ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఈరోజు శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు అనుకోకుండా లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. అయితే వీటితోపాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి రావడం కష్టంగా మారుతుంది. కుటుంబ సభ్యుల ఆమోదంతో వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షకు హాజరవుతారు. అయితే అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువ. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): మిథున రాశి వారికి ఈ రోజు ఆదాయం రెట్టింపు అవుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సోదరులు సలహాతో వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. అయితే వాదన విషయంలో వెనక్కి తగ్గే ఉండాలి. తల్లిదండ్రుల మద్దతుతో ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులకు అదనపు ఆదాయం పొందే అవకాశాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. కుటుంబ సభ్యుల సలహాతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగివస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారికి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఇంట్లో జరిగే శుభకార్యాల గురించి చర్చించుకుంటారు. వ్యాపారాల కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్య రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. తోటి వారి మద్దతుతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీరికి కుటుంబ సభ్యులు మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తుల రాశి ఉద్యోగులకు కార్యాలయాల్లో అదరపు భారం పడుతుంది. అయితే వీరికి తోటి వారి సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది. అయితే ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వృశ్చిక రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆధిపత్యం చెలాయించడానికి అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకున్న తర్వాతే కొత్త పట్టుబడుల గురించి ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో బిజీ వాతావరణాన్ని గడుపుతారు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల మద్దతు ఉంటుంది. దీంతో పోటీ పరీక్షల్లో పాల్గొని విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆమె కోసం విలువైన బహుమతిని కొనుగోలు చేస్తారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. పిల్లల కెరీర్ కోసం డబ్బులు పెట్టుబడిగా పెడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. బంధువుల్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : మీ రాశి వారు ఈరోజు వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఏర్పడుతుంది. అయితే ప్రియమైన మాటలతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. సాయంత్రం పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అదృష్టం కారణంగా వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.