Today Horoscope
Today Horoscope In Telugu: జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు చంద్రుడు కుజుడు కలిసి పంచమయోగం ఏర్పరచనున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాసిన వారు శత్రులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఈ కింది విధంగా ఉన్నాయి..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆందోళనలతో ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు తల్లిదండ్రులతో చర్చిస్తారు. వివాహం చేసుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాల్సి వస్తే వెంటనే తిరిగి చెల్లిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసల పొందుతారు. బంధువుల్లో ఒక సహాయంతో కొత్త ప్రాజెక్టులకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడుపుతారు. పిల్లల కెరియర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనాలపై ప్రయాణం చేసేవారు సూచనలను పాటించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందడంతో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కెరీర్ కోసం ఏదైనా ప్లాన్ చేస్తే భవిష్యత్తులో సక్సెస్ అవుతారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులకు కొందరు ఆటంకాలు సృష్టిస్తారు. అయినా వాటిని అధిగమించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి విషయంలో ఆందోళనగా ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూల సమయం. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ చిన్న అనారోగ్యం ఏర్పడిన వెంటనే వైద్యుడు సంప్రదించాలి. వ్యాపారులు పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం స్నేహితులను కలవడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఏర్పడే అవకాశం ఉంది. చిన్నపాటి ఉద్రిక్త వాతావరణం కూడా ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ప్రియమైన వారి కోసం ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు ఓ విషయంలో ఆందోళనలతో ఉంటారు. విహార యాత్రలకు వెళ్లేవారు వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఇది అనుకూలమైన సమయం కాదు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. మాటలు అదుపులో ఉంచుకోవాలి. రాజకీయ రంగాల వారికి అనుకూలమైన వాతావరణం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు డబ్బు అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగానే.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : మీ రాశి వారు తల్లిదండ్రుల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్ద సలహా తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు డబ్బు కొరత ఏర్పడుతుంది. అయితే బంధువుల నుంచి ఒకరు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా ఫలితాన్ని ఇవ్వదు. వ్యాపారులకు కొందరు మోసం చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి వారు ఈరోజు మానసికంగా ఆందోళనలతో ఉంటారు. ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మానసిక ప్రశాంతత కోసం స్నేహితులను కలుస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి ఎంతో కాలంగా కోరుకుంటున్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. గతంలో ఉన్న వివాదాలు నేటితో తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అధిక ప్రయోజనాలు ఉండే అవకాశం. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.