‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు గజకేసరి యోగం ఏర్పడడంతో మీన రాశి వారితో సహా మరికొన్ని రాశుల వారికి శుభాలు జరగనున్నాయి. మిగతా రాశిలో వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. స్నేహితుల ఒకరి కారణంగా వివాదాలు ఉండే అవకాశం. విద్యార్థుల నుండి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు కొత్త శత్రువులు తయారవుతారు. అందువల్ల కొత్తవారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా భారంపడే అవకాశం ఉంది. ఏదైనా పని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబంలోని ఆస్తి గురించి శుభవార్త విని అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో వివాదం ఉంటుంది. దానిని పరిష్కరించుకోవడానికి కష్టపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులతో మాట్లాడేటప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారం గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. కొన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి హామీ ఇస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వినవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు అపాయింట్మెంట్ అందుకుంటారు. ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవారు మాటలకు కట్టుబడి ఉండాలి. లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి మార్కెట్లో మంచి ఫలితాలు రానున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు చదువుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ విషయాన్ని అయినా శాంతితో పరిష్కరించుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఎవరితోనైనా గొడవపడితే సమయమును పాటించాలి. స్నేహితులు ఇచ్చే సలహాలపై ఆలోచించాలి. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లొద్దు. వ్యాపారులు అపరిచిత వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. ఈరోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండాలి. అనవసరపు ఆ వివాదాల్లో దూరకుండా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఇన్నాళ్లు ఉన్న అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయి. వ్యాపారాలు చేసేవారు కొత్త సమాచారం అందుకుంటారు. విద్యార్థులు కీలక నిర్ణయం తీసుకుంటారు. పాత సమస్యల నుంచి బయటపడతారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. అయితే ఈ సమయంలో పెద్దల సలహా అవసరం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాజు వ్యాపారాలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. అయితే వి రాగానే ఎక్కువగా ఖర్చులు అవుతుంటాయి. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఒకరి కారణంగా వాగ్వాదం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . . ఈ రాశి వారు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతును పొందుతారు. వ్యాపారాలు కొత్త ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఏదైనా వివాదం ఏర్పడితే దానికి దూరంగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ కలలను పూర్తి చేసుకుంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడంతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్లో ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు వ్యాపారంలో ఏర్పడిన సమస్య గురించి ఆందోళన చెందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. విద్యార్థులు గురువుల మద్దతును పొందుతారు. దీంతో పోటీ పరీక్షలో పాల్గొనడం వల్ల విజయం సాధిస్తారు. దూరప్రాయణాలు చేయడం వల్ల లాభాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ప్రియమైన వ్యక్తి కోసం విలువైన బహుమతిని కొనుగోలు చేస్తారు. అనవసరపు ఆందోళనకు గురికాకుండా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆన్లైన్లో డబ్బులు పెట్టేవారు అధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.