‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు, బుధుడు కలయికతో కొన్ని రాశుల వారికి అధిక ప్రయోజనాలు ఉండలు ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు సంతోషంగా గడుపుతారు. అయితే ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. ఆర్థికంగా మోసపోయే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన వార్తలు అందుతాయి. ఇతరుల పనులకు ఆటంక కలిగించకుండా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణాన్ని కొందరు పాడు చేయడానికి ప్రయత్నిస్తారు. మధ్యాహ్నం తర్వాత ఇంట్లో అకస్మాత్తుగా గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉద్యోగులు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు సాధారణ లాభాలు ఉంటాయి. అయితే విలాసాలకు కూడా డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక భారం మీద పడి భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటిని పరిష్కరించుకోవడానికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. ఇంట్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కొందరు వ్యక్తుల చేష్టల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటి సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు చేయకుండా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు కాస్త మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన కారణంగా ఆందోళన ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. ఏదైనా పని పూర్తి చేయడానికి డబ్బు కోసం ఎదురు చూడకుండా వెంటనే ప్రారంభించాలి. వ్యాపారులు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేసిన ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. అయితే ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేయాలి. నిర్లక్ష్యం చేస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఈ రాశి వ్యాపారులు ఈరోజు తక్కువ లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తనలతో భావోద్వేగానికి గురవుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అసాధ్యం అనుకున్న పనులను పూర్తి చేస్తారు. డబ్బు సంపాదించడానికి ఇతర సహాయాలు కోరుతారు. శారీరకంగా ఇబ్బందులు ఎదురవుతాయి. లాబాలను సంపాదించడంలో వ్యాపారులు సమస్యలను ఎదుర్కొంటారు. అనుకోకుండా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : మీ రాశి వారు ఈ రోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో వాగ్వాదం ఉండే అవకాశం ఉంటుంది. గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. డబ్బు సంపాదించడానికి ఉద్యోగులకు అదనపు మార్గాలు ఏర్పడతాయి. అవసరమైన వివాదాలకు తలదుర్చకుండా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతారు. అయితే సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. కొన్ని పనులు సమయానికి పూర్తి చేయడంతో ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. ఈ కారణంగా జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఉత్సాహంగా ఉంటారు. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. యాల యాత్రలకు ప్లాన్ చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ముఖ్యమైన పనులను పెండింగ్లో ఉంచకుండా పూర్తి చేయాలి. ఉద్యోగులకు తోటి వారితో కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే వారితో సమన్వయంగా ఉండడం వల్ల అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తిచేయాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. కొన్ని పనుల కారణంగా మానసికంగా ఆందోళనతో ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులను ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. అయితే కొందరు వీరి బలహీనతలను దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులకు గురి చేస్తారు. అందువల్ల కొన్ని రహస్యాలు ఎవరికి చెప్పకుండా ఉండాలి. కష్టానికి తగిన ఫలితం ఉండకపోవడంతో నిరాశతో ఉంటారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.