Rohit and Virat Kohli : టీమిండియాలో రోహిత్, విరాట్ కోహ్లీ నవ శకాన్ని నిర్మించారనడం లో ఎటువంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా లాంటి జట్టుకు చుక్కలు చూపించారు. న్యూజిలాండ్ లాంటి టీం కు దూకుడు ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఇంగ్లాండ్ జట్టును మట్టికరించారు. దక్షిణాఫ్రికాను బెంబేలెత్తించారు. వెస్టిండీస్ లో ఉరుకులు పెట్టించారు. పాకిస్తాన్ కు నిద్రలేని రాత్రులను పరిచయం చేశారు. మొత్తంగా తమకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో అశేషమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడుతున్న వీరు.. ఒక్కో ఫార్మాట్ కు వీడ్కోలు చెబుతూ వస్తున్నారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత.. ఆ పొట్టి ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికారు. ఇక ఇప్పుడు సుదీర్ఘంగా ఆడుతూ వస్తున్న టెస్ట్ ఫార్మాట్ కు సైతం వీడ్కోలు పలికారు. మొత్తంగా వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు.. దిగ్గజ ఆటగాళ్లు రిటర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. వీరిద్దరి సెంట్రల్ కాంట్రాక్టుకు సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతోంది. దీనిపై బిసిసిఐ ఎట్టకేలకు స్పందించింది.
Also Read : రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ అభిమానులకి బ్యాడ్ న్యూస్…
అదే స్థానంలో కొనసాగిస్తారట
పొట్టి ఫార్మాట్, సుదీర్ఘ ఫార్మాట్ కు రోహిత్, విరాట్ శాశ్వత విరామం తీసుకున్నప్పటికీ.. వారిని ఏ ప్లస్ గ్రేడ్ లోనే కొనసాగిస్తామని డిసిసిఐ స్పష్టం చేసింది. “వారిద్దరూ వన్డేలకు మాత్రమే పరిమితమైనప్పటికీ.. టీమిండియా లో కీలక భాగం. వారి సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే వారు టీమిండియా కు ఎంతో చేశారు. అలాంటి వారి సేవలను గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. వారికి ఏ ప్లస్ గ్రేడ్ సౌకర్యాలు మొత్తం లభిస్తాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పైగా వారిద్దరు టీమిండియా కు రెండు స్తంభాల లాంటి వ్యక్తులు. అటువంటివారిని గౌరవించుకోవడం.. సముచితంగా స్థానం కల్పించడం మా బాధ్యత. అందుకే దానిని సక్రమంగానే నిర్వర్తిస్తున్నాం. వారిద్దరు రిటైర్ అయినంత మాత్రాన.. టీమిండియా కు దూరం జరగలేదు. ఫార్మాట్ల నుంచి మాత్రమే పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకున్నారు. అంతకుమించి ఏమీ లేదు. కాంట్రాక్టులతో ముడిపడి ఉన్న ఆటగాళ్లు వారిద్దరు కాదు. వారి ఆట వేరు కాబట్టి.. ఎప్పటికీ గుర్తుంచుకునే ముందుకు సాగుతామని” బిసిసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో స్పెషల్ కాంట్రాక్టు సంబంధించి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై జరుగుతున్న చర్చకు మొత్తంగా ఫుల్ స్టాప్ పడింది. టీమిండియాలో ఎ ప్లస్ కేటగిరి ఉన్న ప్లేయర్లు నలుగురు ఉన్నారు. వారిలో రోహిత్, విరాట్ రెండు ఫార్మాట్లకు శాశ్వత వీడ్కోలు పలికారు. రవీంద్ర జడేజా టి20 లకు మాత్రమే గుడ్ బై చెప్పాడు. మొత్తంగా ప్రతి ఏడాది ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ప్లేయర్లకు 7 కోట్ల వేతనం లభిస్తుంది.
Also Read : ఇంగ్లాండ్ సిరీస్ లో రోహిత్, కోహ్లీ ఆడతారా? బీసీసీఐ క్లారిటీ