Today horoscope in telugu : జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శివుడి అనుగ్రహంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మరి కొన్ని రాశుల వారు కుటుంబ సమస్యలను ఎదుర్కొని ఒత్తిడితో ఉంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా వరకు డబ్బు ఖర్చు అవుతుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త విద్యాసంస్థల్లో ప్రవేశానికి విద్యార్థులు ఉత్సాహం చూపిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్త వారితో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు కొన్ని సూచనలు పాటించాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. అయితే వివాదాలు ఏర్పడినప్పుడు సంయమనం పాటించాలి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి సిద్ధమవుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఖర్చులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరితోనూ డబ్బు వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. అధికారులతో ఒత్తిడి ఎదుర్కొంటే సంయమనం పాటించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు రాజకీయాల్లో ఉంటే ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపారవేత్తలకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. కొత్తగా పెట్టుబడును పెట్టాలని అనుకునేవారు ప్రజలను సంప్రదిస్తారు. ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ప్రత్యర్థుల నుంచి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాలను జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఉద్యోగులు బదిలీల వార్తలు వినే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపడతారు. దీంతో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో వాదనకు దిగే అవకాశం ఉంది. వివాహానికి సంబంధించిన చర్చ ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్తవారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఎవరితోనైనా ఇబ్బందిని కలిగితే వారితో దూరంగా ఉండటమే మంచిది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయం కాదు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. సాయంత్రం విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటే అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సమస్యలు ఉండే అవకాశం. అయితే ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణ ఉంటుంది. వ్యాపారులు గణనీయమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఉత్సాహం కలుగుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు కోటి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఉద్యోగులు చాలా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్త అవకాశాల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. వీటిని వెంటనే పరిష్కరించుకుంటారు. అయితే ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంలో కొన్ని విభేదాలు ఉంటాయి. దీంతో మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు వ్యాపార అభివృద్ధి కోసం కొత్త వ్యక్తులను కలుస్తారు. కుటుంబ సభ్యుల సలహాతో దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. వ్యక్తిగతంగా అనేక ప్రయోజనాలు పొందుతారు అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.