Bigg Boss 9 Telugu : ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఊహించని ట్విస్టులు కొనసాగుతున్నాయి. కచ్చితంగా ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉంటుందని మొదటి రోజే అందరికీ అర్థం అయ్యింది. నిన్న వీళ్లంతా హౌస్ లోకి అడుగుపెట్టారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష, నిఖిల్ నాయర్, అయేషా ఖాన్, గౌరవ్ గుప్త, శ్రీనివాస్ సాయి హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ పేరుతో హౌస్ లోకి అడుగుపెట్టారు. మొదటి రోజు అంతా చాలా బాగా అనిపించారు కానీ, దివ్వెల మాధురి మాత్రం చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపించింది. ఇప్పుడే ఇలా ఉంటే, ఈమె భవిష్యత్తులో చాలా పెద్ద అనవసరమైన గొడవలు పెట్టుకునేలా అనిపించింది. ఇంత బలుపు, అహంకారం ఉన్నవాళ్లు బిగ్ బాస్ హౌస్ కి సూట్ అవ్వరు అని కూడా అనిపించింది. అసలు ఏమి జరిగిందో చూద్దాం.
ఈమె హౌస్ లోకి అడుగుపెట్టగానే, ఈమె గురించి తెలిసిన ఇమ్మానుయేల్, ఆమ్మో ఈమె వచ్చిందా అని అంటాడు. హౌస్ లో సగం మందికి ఆమె ఎవరో తెలుసు, సగం మందికి తెలియదు. ఆ తెలియని వారిలో దమ్ము శ్రీజ కూడా ఉంది. మాధురి హౌస్ లోకి అడుగుపెట్టగానే అందరిని పలకరించింది, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ శ్రీజ మీ పేరు ఒకసారి తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. ఇక్కడ మాధురి అహం బాగా దెబ్బ తినింది. హౌస్ మేట్స్ ని అడిగి తెలుసుకో అని అంటుంది. అంటే ఇంత పాపులర్ అయిన నేను, నీకు తెలియదా అనే పొగరు, అహంకారం ఆమెలో స్పష్టంగా కనిపించింది. తర్వాత లివింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చుంటున్నప్పుడు, నాకు నిజంగానే మీ పేరు తెలియక అడిగాను, దానికి మీరు హౌస్ మేట్స్ ని అడిగి తెలుసుకోండి అని అన్నారు, నాకు అది అసలు అర్థం అవ్వలేదు అని అంటుంది.
దానికి దివ్వెల మాధురి ‘ఏంటి ఇప్పుడు..వచ్చి రాగానే నాతో గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నావా?’ అని అంటుంది. అప్పుడు శ్రీజ పేరు అడిగి తెలుసుకోవడం లో తప్పేమి ఉంది అని అంటుంది. అక్కడితో వీళ్ళ మధ్య సంభాషణ ముగిసింది. దివ్వెల మాధురి ఆమెకు ఆమె పెద్ద స్టార్ హీరోయిన్, సూపర్ స్టార్ లెవెల్ లో తనని తానూ ఊహించుకుందేమో, ఆమె పాపులర్ అయ్యింది ఒక వివాదం వల్ల. ఆ వివాదం ఏంటో సోషల్ మీడియా ని అనుసరించే ప్రతీ ఒక్కరికి తెలుసు. రీతూ చౌదరి, ఇమ్మానుయేల్, భరణి, రాము రాథోడ్ వంటి వారికి ఈమె చరిత్ర తెలుసు. అందుకే హౌస్ లోకి రాగానే వామ్మో అని భయపడ్డారు, తనూజ కూడా ఏంటి ఈమె ఇలా ఉంది అంటూ ఇమ్మానుయేల్ తో మాట్లాడుతుంది. దివ్వెల మాధురి ఇదే యాటిట్యూడ్ తో ఉంటే మాత్రం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఈమెనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది.