Homeఆధ్యాత్మికంToday 7 May 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్త..

Today 7 May 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్త..

Today 7 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తర ఆషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులు తమకు అనుకూలమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు పరిమితంగా ఉండాలి. లేకుంటే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో వాదాలను ఉంటాయి. కొన్ని పనులకు ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణమున్నా కూడా అధికారుల నుంచి వేధింపులు మొదలవుతాయి. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో సానుకూలపైన ఫలితం ఉంటుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి గురువుల మద్దతు ఉంటుంది. ఆగిపోయిన పనులు తిరిగి పుంజుకుంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే మాటల మాధుర్యంలో ఎక్కడా తప్పులు కాకుండా చూసుకోవాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఇతరుల చెప్పే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అధికారులు ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడమే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే సంప్రదింపుల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకూడదు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరగడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు పెద్దలను సంప్రదిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. విద్యార్థులు గురువుల సహకారంతో ముఖ్యమైన పరీక్షలను పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Oktelugu Epaper
Exit mobile version