Today 7 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శనీశ్వరుడి అండదండలు ఉండడంతో లాభాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇతరులకు దానం చేస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. కొత్త వాహనాలకు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఆగిపోయిన డబ్బును వసూలు చేసుకుంటారు. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఇతరుల సలహా తీసుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఉండాలి. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అయితే వీరికి అధికారుల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లినందుకు ప్లాన్ చేస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నివారించాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇతరులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ప్రయత్నించాలి. ఆర్థికంగా బలపడేందుకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగని ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షలో సులభంగా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. గత కొంతకాలంగా గందరగోళంగా ఉన్న పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. దీంతో అనుకున్నా రాబడిని పొందుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొత్తగా ఉద్యోగం చేరే వారికి ఉత్సాహం ఉంటుంది. వీరికి అధికారుల మద్దతు ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టులను చేపడితే వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. విదేశాలకు వెళ్లడానికి ఇదే మంచి సమయం. వ్యాపారాలు గతంలో కంటే ఇప్పుడు గణనీయంగా లాభాలు పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులకు వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. ప్రయాణాలు చేయడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు కోర్టు సంబంధిత చెక్కుల నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది.