Today 7 July 2025 Horoscope: గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేటప్పుడు కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. సోమవారం ద్వాదశరాసులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు ఉండనున్నాయి. ఈరోజు మొత్తం రాశుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల మాటలు విషయంలో సంయమనం పాటించాలి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండడంతో లాభాలు ఉంటాయి. ఉద్యోగులు చేపట్టిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి ఉద్యోగులు కార్యాలయాల్లో బిజీగా ఉంటారు. వీరికి ఉద్యోగుల మద్దతు ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేవారు ప్రజలను ఆకర్షిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. అయితే ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కష్టపడి పనిచేసిన వారికి ఈరోజు సరైన ఫలితాలు ఉంటాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేసే ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఇతరులకు అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు పొందుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే వాహనాలపై వెళ్లేవారు ముందు ప్రణాళికతో ప్రారంభించాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వివాదాల్లో మౌనంగా ఉండడమే మంచిది. గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు. తల్లిదండ్రుల మద్దతుతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ముఖ్యమైన పనులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . విదేశాల నుంచి సమాచారం అందుకుంటారు. విద్యార్థులు కెరీర్ పై పోకస్ పెడతారు. అనవసరమైన వివాదాలు కి తలదూర్చకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల వివాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు ఇతర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. పెద్దల సలహాతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . . ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసాలు పొందుతారు. వ్యాపారులకు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వారితో మాట్లాడే సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈరోజు వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉండరు ఉంది. ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి. ఉద్యోగులు గతంలో చేపట్టిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి జీతం పెరిగే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు జీవిత భాగస్వామితో కలిసి కొత్తగా పెట్టుబడులు పెడతారు. తెలియని వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఉద్యోగులకు అదనపు ఆదాయం పొందేందుకు అనువుగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఎవరితోనైనా మాట్లాడే సమయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తలదురుచకుండా ఉండాలి. కుటుంబంలో సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించుకోవాలి. విద్యార్థులు కెరీర్ పై పోకస్ పెడతారు. వ్యాపారులు కొత్త ఆదాయం ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళికలు వేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. దీంతో కొత్త బాధ్యతలను చేపడతారు. అనుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతో ప్రశంసలు వస్తాయి. రాజకీయ రంగాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : గతంలో ఉన్న అనారోగ్యం తొలగిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. కొత్తగా ఏదైనా ప్రాజెక్టు చేపడితే తోటి వారి మద్దతును కూడా కట్టుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.