Homeఎంటర్టైన్మెంట్Nani The Paradise crosses Varanasi: 'వారణాసి' ని అవలీలగా దాటేసిన నాని 'ది ప్యారడైజ్'..ఇది...

Nani The Paradise crosses Varanasi: ‘వారణాసి’ ని అవలీలగా దాటేసిన నాని ‘ది ప్యారడైజ్’..ఇది మామూలు మాస్ కాదు!

Nani The Paradise crosses Varanasi: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) పుట్టినరోజు సందర్భంగా , ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) నుండి ‘ఆయా షేర్’ అనే పాటని విడుదల చేయగా , అది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ పాటనే కనిపిస్తోంది. కుర్రాళ్ళు అయితే ఊగిపోతున్నారు . సాధారణంగా అనిరుద్ పాటలకు ఒక […]

Nani The Paradise crosses Varanasi: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) పుట్టినరోజు సందర్భంగా , ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) నుండి ‘ఆయా షేర్’ అనే పాటని విడుదల చేయగా , అది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ పాటనే కనిపిస్తోంది. కుర్రాళ్ళు అయితే ఊగిపోతున్నారు . సాధారణంగా అనిరుద్ పాటలకు ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. అలాంటి అనిరుద్ నుండి ఇంతటి అద్భుతమైన పాట వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఈ పాటకు 25 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. లైక్స్ అయితే దాదాపుగా 8 లక్షల 12 వేల వరకు వచ్చింది. చాలా మంది స్టార్ హీరోల సినిమాల పాటలకంటే చాలా ఎక్కువ ఇది.

ఈ పాటకంటే రెండు రోజుల ముందు విడుదలైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పాటకు , ‘ఆయా షేర్ ‘ కి వచ్చిన రీచ్ లో సగం కూడా రాలేదు. కేవలం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాట మాత్రమే కాదు , సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ కంటే కూడా ‘ప్యారడైజ్’ పాటకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ‘వారణాసి ‘ లోని ‘సంచారి’ అనే పాటకు మూడు నెలలకు కలిపి 17 లక్షల వ్యూస్ , 4 లక్షల 96 వేల లైక్స్ వచ్చాయి. అంటే ‘ప్యారడైజ్’ లో సగం అన్నమాట. దీనిని బట్టీ ‘ది ప్యారడైజ్’ చిత్రానికి జనాల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. శృతి హాసన్ , ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి కలిసి పాడిన కూడా ఈ పాటకు ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం .

Also Read: గూస్ బంప్స్ రప్పిస్తున్న ‘వారణాసి’ మేకింగ్ వీడియో..నాగార్జున ఎంట్రీ ట్విస్ట్ అదుర్స్!

అంతే కాదు పాటకు వస్తున్న వ్యూస్ స్పీడ్ ని చూస్తుంటే రీసెంట్ గా విడుదలై గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన పెద్ది ‘చికిరి చికిరి ‘ పాట వ్యూస్ ని కూడా ఫుల్ రన్ లో దాటేసే అవకాశం ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఇలాంటి రెస్పాన్స్ ఇంత వేగంగా వస్తూ ఉండేవి. ఇప్పుడు నాని కి ఆ రేంజ్ లో వ్యూస్ వస్తున్నాయంటే, ఆయన కూడా స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టడా అని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper