Today 6 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా మెరుగైన ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మాటల మాట్లాడేటప్పుడు తొందర పడొద్దు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. స్నేహితుల సహకారంతో విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో తమ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు నైపుణ్య ప్రదర్శనతో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఉంటాయి. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బంధువుల సహాయంతో అప్పులు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉంటుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో ఈరోజు అధిక లాభాలు పొందుతారు. మీకు సంబంధం లేని వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది. శని దేవుడి అండదండలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అనవసరమైన పనులకు దూరంగా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన ప్రాజెక్టులను చేపడుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉన్నటువంటి వ్యాపారాలు అత్యధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో అప్పులను తీరుస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా రంగాల్లో కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి అండదండలతో ఉద్యోగులు తమ కార్యకలాపాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం లో గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను సకాలంలో పోల్చి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక ముఖ్యమైన వ్యక్తి కలవడంతో వ్యాపారులకు కలిసి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య ఉండడంతో వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో మానసికంగా సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.