Homeఆధ్యాత్మికంToday 31st July 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు పంట పండినట్లే..

Today 31st July 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు పంట పండినట్లే..

Today 31st July 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉండనున్నాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఈరోజు పంట పండినట్లే అన్న విధంగా లాభాలు ఉంటాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. అయితే వీటిని వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులు తోటి వారితో సంయమనం పాటించాలి. అనవసరంగా కోపాన్ని తెచ్చుకుంటే భాగస్వాముల మధ్య విభేదాలు తీవ్రమవుతాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలకు పొందుతారు. అయితే ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఈ సమయంలో అనవసరంగా మాట్లాడ టం వల్ల విభేదాలు వస్తాయి. అందువల్ల ఆచితూచి మాట్లాడాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకుంటే ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఖర్చులు చేస్తారు. ప్రయాణాలు చేసేవారు ఓపికతో ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు పంట పండినట్లే. ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. అయితే కొన్ని రంగాల వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపార ప్రణాళికలు కొన్ని దెబ్బతింటాయి. పెద్దల సలహా తీసుకొని కట్టుబడులు పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు పొందాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలు ఉద్రిక్తతకు దారితీస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. అనవసరపు వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. డబ్బు విషయాలను వ్యాపార భాగస్వాములతో పంచుకోకుండా ఉండాలి. ఏదైనా వివాదం ఏర్పడితే కోపాన్ని నియంత్రించుకోవాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈరోజు వారికి ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఉంటాయి. అయితే ఏదైనా పని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేయాలి. నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపడితే పెద్దల సలహా కచ్చితంగా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. వీరికి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే సమాజంలో గుర్తింపును కోల్పోతారు. అనవసరపు వివాదాల్లోకి తలదించకుండా ఉండాలి. అనారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినా కూడా వైద్య సలహా మేరకు నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించడం మంచిది. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న సమస్యలను పూర్తి చేస్తారు. ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలకు పొందుతారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. దీంతో వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో చేసే వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడును పెడతారు. ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఫైనాన్స్ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. ఎక్కువగా ఆందోళన చెందకుండా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ఇతరులను వెంటపెట్టుకొని వెళ్లడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి చాటింగ్ చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఉద్యోగులు అధికారులతో వాదనలకు దూరంగా ఉండాలి. తోటి వారి మద్దతుతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి. వ్యాపారులు గతంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version