Homeఆధ్యాత్మికంToday 30 July 2025 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..

Today 30 July 2025 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..

Today 30 July 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు సంతోషంగా గడుపుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం. షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వస్తువులు కొనుగోలు చేయొద్దు. ఈ సమయంలో డబ్బులు పొదుపు చేయడమే మంచిది. వ్యాపారులు లాభాలను పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఇదే మంచి సమయం.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. అయితే అనుకున్న పనిని త్వరగా పూర్తిచేసి ఈ సమస్య నుంచి బయటపడాలి. లేకుంటే ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఈ సమయంలో కొత్త భాగస్వాములు చేరుతారు. అయితే వారితో ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు అప్పుడే జరపకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగా పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తే వెళ్లొచ్చు. ఇతరులకు అప్పు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ధన లాభం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం వీరిదే అవుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలకు దూరంగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఒక పనిని పూర్తి చేయడానికి ఈరోజు కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో పాటు పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు అధికారంలో నుంచి వేధింపులు ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే వారితో సంయమనం పాటించడంతో సమస్య పరిష్కారం అవుతుంది. స్నేహితులతో దూర ప్రయాణాలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . సింహరాశి వారు ఈరోజు అనుకోని అదృష్టాన్ని పొందుతారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. అయితే స్నేహితుల్లో ఒకరు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల డబ్బు విషయంలో ఎవరిని నమ్మకుండా ఉండడమే మంచిది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనే సమయంలో గురువుల నుంచి సలహా తీసుకోవాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు అనుకున్న పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలను ఇతరులకు చెప్పకుండా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలను చేపట్టడంతో కాస్త బిజీగా ఉంటారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి సరైన మార్గం దొరుకుతుంది. కొత్తగా ప్రాజెక్టు చేపట్టేవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైనా అప్పు ఇస్తే తీసుకోవచ్చు. తిరిగి చెల్లించే శక్తి ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. అయితే ఆదాయం పెరిగినంత మాత్రాన ఖర్చులు పెట్టకుండా ఉండాలి. ఉద్యోగులకు కొన్ని నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారులు జీవిత భాగస్వామితో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఖర్చులు వెంటాడుతూ ఉంటాయి. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనిని ఇన్ టైంలో పూర్తిచేస్తారు. అధికారుల నుంచి ప్రశంశాలు అందుతాయి. కొందరికి పదోన్నతులు కూడా వస్తాయి. అయితే వ్యాపారులు ప్రణాళిక వేయడంలో విఫలమవుతారు. భాగస్వాములతో విభేదాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి లాభా ఉంటుంది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . పెండింగ్ సమస్యలు మనసుకు ఆందోళన కలిగిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు ఉంటాయి. అయితే వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఇది అనుకూలమైన సమయం కాదు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. పెద్దల సలహాతో దూర ప్రయాణాలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . మీ రాశి వారికి ఈరోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే ఇదే సమయంలో ఖర్చులు కూడా భారీగా ఉంటాయి. అందువల్ల అనవసరపు వస్తువుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న అనారోగ్యం కలిగిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూల ఫలితాలే ఉంటాయి. మీరు కొత్తగా వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఉద్యోగులు చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే అనుకున్న ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular