Today 30 August 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. దీంతో ఆయా రాశులు కలిగిన వారి జీవితాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. శనివారం మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : గతంలో చేపట్టిన పనులు పూర్తవుతాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆస్తు వివాదాలు తొలగిపోతాయి. ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. గతంలో కంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరిగినా కూడా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. స్నేహితుల్లో కొందరితో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు ఒకరి కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విహారయాత్రలకు వేసిన ప్లాన్ వాయిదా పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు చేపడితే పెద్దల సలహా తీసుకోవాలి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. దీంతో వ్యాపారాలు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు అందరూ ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొందరి ప్రవర్తన కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులు తమ రహస్యాలను కొత్త భాగస్వాములకు చెప్పద్దు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చవద్దు. కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల గొడవలు ఉంటాయి. ఇటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆదాయం పెరుగుతుంది. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వద్ద డబ్బులు తీసుకుంటే తిరిగి వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయాలి. నిరుద్యోగులు అవకాశాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఏర్పడిన వివాదం నుంచి బయటపడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాల అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపడితే ఇతరుల సలహా తీసుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో సంతోషంగా ఉండగలుగుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఇంట్లోకి బంధువులు రాకతో సౌందర్య ఉంటుంది. కొన్ని పనులు పూర్తి కావడానికి కష్టపడాల్సి వస్తుంది. అయితే తోటి వారి సహాయంతో వీటిని పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఉత్సాహంగా పని చేయగలుగుతారు. గతంలో చేపట్టిన కొన్ని పనుల వల్ల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు సాధారణ లాభాలు ఉంటాయి. అయితే దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఒకరిద్దరితో విభేదాలు ఉంటాయి. వీటిని పట్టించుకోకుండా ఉండడమే మంచిది. విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గతంలో చేపట్టిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి వ్యాపారం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.