Today 3 July 2025 Horoscope: మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఇతరులనుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఒక పనిని ప్రారంభించిన తర్వాత పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగకుండా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరిగిన అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడినప్పటికీ వెంటనే సమస్య పోతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): డబ్బు వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. వారి కెరీర్ పైకి ఇలాగ నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో ఒకరికి ఆదాయం రావడంతో ఇంట్లో సందడిగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో గొడవలు ఉంటాయి. అయితే వాదనలో విషయంలో సంయమనం పాటించాలి. రాజకీయ నాయకులు ఇతరులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితుల సహాయంతో దూర ప్రయాణాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులకు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు పెరగడంతో మనస్థాపం చెందుతారు. దూర ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి రాజకీయ రంగంలో ఉండే వారికి ప్రజల మద్దతు పెరుగుతుంది. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వాతావరణం లో మార్పులు కారణంగా ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. కొందరు వ్యాపారానికి అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని ఆర్థికపరమైన చెక్కులు ఉండే అవకాశం
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో అదనపు ఆదాయాన్ని పొందేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో చేసిన తప్పుల నుంచి బయటపడతారు. కొత్తగా ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ఊహించని విధంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదమైన రోజుగా ఉంటుంది. ముఖ్యమైన పనులపై దృష్టి పెడతారు. స్నేహితుల సహాయంతో దూర ప్రయాణాలు చేస్తారు. పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. ఏవైనా విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పై చందుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడును పెడతారు. ఆర్థికంగా ఊహించని లాభాలు ఉండలు ఉన్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో దూర ప్రయాణాలు చేస్తారు.