Renuka Chowdhury: రాజకీయాలలో మార్మికతకు ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలను నేతలు అంతర్గతంగానే సంభాషించడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి వేదికలైనా సరే కొన్ని కొన్ని విషయాలలో అలా వరకు గోప్యత పాటిస్తూ ఉంటారు. దాపరికాన్ని పాటించడం వల్ల రాజకీయాలలో కొన్ని విలువలను కాపాడుకుంటారు. అయితే కొంతమంది నాయకులకు అలాంటిది ఉండదు. వేదిక ఏదైనా సరే.. ఎక్కడైనా సరే మొహమాటం లేకుండా ఉన్న విషయాన్ని చెప్పేస్తుంటారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా సరే వాళ్ళు స్వీకరించగలుగుతారు. ఈ జాబితాలో రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుక చౌదరి మందు వరుసలో ఉంటారు. ఏ విషయాన్ని ఆమె మనసులో దాచుకోరు. పైగా ఎవరేమనుకున్నా పర్వాలేదు.. నా దారి నాదే అన్నట్టుగా ఆమె నడుచుకుంటారు.. కీలక వ్యాఖ్యలే కాదు సంచలన వ్యాఖ్య కూడా చేసి ఆమె మీడియాలో తెగ ప్రచారంలో ఉంటారు.
Also Read: పిల్లలంతా ఎవరి దారి వారు చూసుకున్నారు..ఈ వృద్ధ తల్లిదండ్రుల కోసం ఆ ఊరి సర్పంచ్ ఏం చేశాడంటే?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్లలో రేణుకా చౌదరి ఒకరు. గతంలో ఈమె ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈమె చక్రం తిప్పారు. సోనియాగాంధీకి అత్యంత సన్నిహితురాలుగా ఉన్నారు. రాహుల్ గాంధీకి కూడా దగ్గర వ్యక్తిగా ముద్రపడ్డారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల తరువాత రేణుకా చౌదరి ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీలో తగ్గిపోయింది. ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమయ్యారు. రేణుక చౌదరి ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. రేణుక చౌదరి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనర్ఘళంగా మాట్లాడతారు. ఏ విషయమైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. ఇటీవల ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఓపెన్ గానే మాట్లాడేశారు. ఏమాత్రం ఇబ్బంది పడకుండా తాను ఏమనుకుంటున్నానో.. అదే విషయాన్ని చెప్పేశారు.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ సర్వనాశనం అయిందని.. అసాంఘిక శక్తులు పేట్రేగిపోయాయని రేణుక ఆరోపించారు. జగన్ నిర్వాకం వల్ల అమరావతి రాజధాని ఆగమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేణుక ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి అలా వెనకేసుకొని వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను రేణుక చౌదరి తలకిందులు చేశారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు అంత గొప్పగా లేదని.. ఊహించిన మాదిరిగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేయడం లేదని రేణుక అన్నారు. ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వం పనితీరు డౌన్ లో ఉందని వ్యాఖ్యానించారు.. రేణుక చేసిన వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని.. చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గాన్ని చెందిన కీలక నాయకురాలే ఈ మాట మాట్లాడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ అధికారంలోకి వస్తుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
చాలా తొందరగా చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది.
చంద్రబాబు వస్తే ఏదో ఉద్దరిస్తాడు అని ఆశతో ఎదురుచూసాం.. ఏమి లేదు మొత్తం డొల్ల.
– రేణుక చౌదరి, కాంగ్రెస్ ఎంపీ pic.twitter.com/of9eJZemIP— Anitha Reddy (@Anithareddyatp) July 1, 2025