Today 29 July 2025 horoscope : గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో కొందరి జీవితాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనూహ్యమైన మార్పులు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు మానసిక ఒత్తిడితో ఉంటారు. వ్యక్తిత్వ ప్రతిభకు భంగం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండడమే మంచిది. కొత్త పనులు ప్రారంభించడానికి మరికొంత సమయం తీసుకోవాలి. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులు కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టును చేపట్టాలని అనుకుంటే ఈరోజు అనుకూల సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. వ్యాపారులకు కొందరు భాగస్వాములు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరితో కమ్యూనికేషన్స్ ప్రాబ్లం ఉండడంతో విభేదాలు ఏర్పడతాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లోకి అవసరమైన కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. కానీ ఈ సమయంలో తెలివిగా ఖర్చు పెట్టాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులు కొన్ని కార్యకలాపాలతో బిజీగా ఉంటారు. కొత్త బాధ్యతలను చేపట్టడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఈ సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఆర్థిక వ్యవహారాలను ఇతరులతో పంచుకోకూడదు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈరోజు మీ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణ ఉంటుంది. అవసరం ఉన్నంతవరకు మాత్రమే ఖర్చులు చేయాలి. ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు దానిని పూర్తి చేసే వరకు వదలకూడదు. ప్రియమైన వారితో ఈరోజు సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి ఉద్యోగులు తీవ్రంగా కృషి చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. వీటిని వెంటనే పరిష్కరించుకుని ప్రయత్నం చేయాలి. వ్యాపారులు ప్రణాళిక అబద్ధంగా పనులు చేపట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఇవి లభిస్తాయి. కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అనవసరపు ఖర్చులను చేయకుండా ఉండాలి. వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు. అనుకున్న పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. డబ్బు కొరత తీవ్రంగా ఉంటుంది. కొన్ని అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అయితే తీవ్ర ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నం చేయాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న ఆదాయం రావడంతో కాస్త సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి దూరమవుతుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని రహస్యాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదం ఏర్పడితే మౌనంగా ఉండటమే మంచిది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . వ్యాపారులు ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించుకోవాలి. జీవిత భాగస్వామితో ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈరోజు అనుకున్న విజయాలను పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు ఇతరుల నుంచి అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రణాళిక ప్రకారంగా పెట్టుబడులు పెడతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. లక్ష్యాలను నెరవేర్చడానికి ఉద్యోగులు కృషి చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రియమైన వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటాయి. గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఇతరుల వద్ద ఆగిపోయిన ఆదాయం ఈరోజు వసూల్ అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గడానికి కష్టపడాల్సి వస్తుంది.