Coolie vs War 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో తెలుగు యాక్టర్స్ ముందు వరుసలో ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాంటి నటుడు ఎవ్వరికి అందనంత ఎత్తులో ముందుకు తీసుకెళుతున్నాడు. దేవర (Devara) సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు రాబోతున్న వార్ 2 (War 2) సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి తీవ్రమైన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు… ఇక దానికి బాలీవుడ్ దర్శకుడు అయిన ‘ అయాన్ ముఖర్జీ’ డైరెక్షన్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే ఉంది. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అంటూ అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు…ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సైతం ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది…
Also Read: కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది…రజినీ కాంత్, నాగార్జున లు హైలెట్ కాబోతున్నారా..?
ఇక ఇదిలా ఉంటే అదే రోజున రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న కూలీ (Cooli) మూవీ కూడా రిలీజ్ అవుతోంది. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వార్ 2 ను తట్టుకొని కూలీ సినిమాని నిలబెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
రజినీకాంత్ కి చాలా మంచి మార్కెట్ ఉన్నప్పటికి ఈ సినిమా టాక్ మీదనే సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… సినిమాలో సస్పెన్స్ ను గొలిపే అంశాలు చాలానే ఉన్నాయి అంటూ లోకేష్ కనకరాజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో సినిమా మీద అమాంతం అంచనాలు పెంచారు. మరి ఇదిలా ఉంటే ఈ రెండింటి మధ్య ఎవరు ఎవరి పైన విజయం సాధిస్తారు.
Also Read: AM రత్నం ఎలాంటి సినిమాలు తీశాడో తెలుసా..? ఆయన హిస్టరీ చూస్తే హడల్!
వార్ 2 ను తట్టుకొని కూలీ సినిమాను నిలబెట్టగలిగే కెపాసిటీ లోకేష్ కనకరాజుకి ఉందా రజనీకాంత్ మరోసారి రిపీట్ చేయగలుగుతాడా? నాగార్జున చేయబోతున్న నెగెటివ్ క్యారెక్టర్ ఈ సినిమాని కాపాడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఈ రెండు సినిమాల మధ్య రాబోతున్న పోటీలో ఎవరు విజయం సాధిస్తారు అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారనుంది.