Today 28 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాజులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారిపై వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వ్యాపారులు ప్రత్యర్థులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ప్రణాళికతో ముందుకు వెళ్తారు. ఫలితంగా అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటు పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈరోజు సమాజంలో గుర్తింపు పొందుతారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు తోటి వారి సహాయము ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. దీంతో సంతోషంగా ఉండగలుగుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. వ్యాపార అభివృద్ధికి తోటి వారి సహాయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో లాభాల పంట పండుతుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా సంతోషంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. దీంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. అనవసరపు వాదనలకు దిగకుండా ఉండడమే మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదిస్తారు. అయితే వీరికి అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకొని ప్రయత్నం చేయాలి. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే ముందు కాస్త ఆలోచించాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ధన పండుగ ఉండనుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సమాజంలో వీరికి గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకుంటారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలోనే మౌనంగా ఉండడం మంచిది. ఆచితూచి వ్యవహరించి ముందుకు వెళ్లాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని సమస్యల పరిష్కారానికి ఓపిక చాలా అవసరం. అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల పెడదా ఉంటుంది. ఇలాంటి సమయంలో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.