Homeఆధ్యాత్మికంToday 27 May 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు స్పెషల్.. ఆర్థికంగా ఊహించని...

Today 27 May 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు స్పెషల్.. ఆర్థికంగా ఊహించని లాభాలు..

Today 27 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొందరు వ్యాపారులు ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మరికొందరు కోపాన్ని తగ్గించుకోవడమే మంచిది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ప్రతి పనిని పెద్దతో చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోవడంతో వ్యాపారులకు సపోర్టుగా ఉంటారు. అనువైన వాతావరణం ఉండడంతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినా కూడా వాటిని అధిగమిస్తూ అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు మిత్రులతో సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. కోపం పెరిగే అవకాశం ఉంటుంది. దానిని నియంత్రణలో ఉంచుతేనే పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు కనిపిస్తాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో ఉద్యోగులు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్య రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. గ్రహాల అనుకూలతతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకోకుండా అదృష్టం ఏర్పడుతుంది. దీంతో కొందరు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అవసరమైన డబ్బు సకాలంలో అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రహస్యాలను ఇతరులతో చెప్పకూడదు. ముఖ్యమైన పనులను వాయిదా వేయడమే మంచిది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనులు ఒకే సమయానికి పూర్తవుతాయి. దీంతో సంతృప్తిగా ఉండగలుగుతారు. కొన్ని పనులు పూర్తికావడానికి కష్టపడాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలకు దూరంగా ఉండటమే మంచిది. కుటుంబ సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు నిరుద్యోగులు అయితే వీరికి శుభవార్తలు అందుతాయి. ఇప్పటికే ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న ఫలితాలు ఉంటాయి. ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే సంయమనం పాటించాలి. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు రావడంతో సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి సహకారం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper