Today 27 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంవల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాజు వారు ఈరోజు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు తోటి వారి సహాయంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనుల కారణంగా మనశ్శాంతిని కోల్పోతారు. అయితే కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఉండకూడదు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు తోటి వారి సహకారంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి లాభాల పంట పండుతుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తే అందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడును పెట్టే అవకాశం ఉంది. ఇవి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. బంధువుల సహాయంతో అప్పుల నుంచి బయటపడతారు. కొత్తగా ఎవరికీ డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాముల మద్దతు ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు పుట్టుకొస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఇవి పూర్తి చేయడానికి తోటి వారి సపోర్ట్ తీసుకుంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తను వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ఇంట్లో వాతావరణం ఈరోజు సంతోషంగా ఉంటుంది. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు. రాజకీయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే వీరికి పెద్దల మద్దతు ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వ్యాపారులకు తోటి వారి సపోర్టు ఉంటుంది. అప్పులను తీరుస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు వస్తువులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడుల విషయంలో కీలక నిర్వహించి తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి.