Today 25 July 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో భాగంగా శుక్రవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు శ్రావణ ప్రారంభం వేళ కొన్ని రాశుల వారికి శుభయోగం కలగనుంది. మరికొన్ని రాసిన వారు తమ కార్యకలాపాలతో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. వీరికి శ్రావణమాసం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి అన్యోన్యంగా గడుపుతారు. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చిన తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఒత్తిడి నుంచి దూరమవుతారు. వీరికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. కొందరు మిమ్మల్ని అడ్డదారి పట్టించే అవకాశం ఉంటుంది. అయితే ఎవరి మాటలు పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు బిజీగా గడుపుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. మాటలు అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే సంబంధాలలో చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది. సోదరుల మధ్య విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. కార్యాలయాల్లో ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి. తోటి వారి సహాయాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థులు విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . సింహరాశి వారికి ఈరోజు సాధారణ జీవితం ఉంటుంది. కొన్ని ఆలోచనలు నియంత్రించుకోవాలి. ప్రతి విషయంలోనూ వాగ్వాదం పనికిరాదు. కుటుంబ సభ్యుల మధ్య సమస్య ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అవసరం ఉన్నంతవరకే డబ్బులు ఖర్చు చేయాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఒక ముఖ్యమైన పని నిమిత్తం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. కొన్ని వివాదాల్లో మౌనంగా ఉండటమే మంచిది. డబ్బు కొరత ఏర్పడితే వెంటనే ఇతరులను సంప్రదించి అప్పుగా తీసుకోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలకు దూరంగా ఉండాలి. ఇష్టమైన వారితో ఈరోజు సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారం చేసేవారికి పరిస్థితులు అనుకూలంగా ఉండి లాభాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలి. ఆదాయం పెరిగిన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అదనపు ఆదాయం కోసం అవకాశాలు తెచ్చుకుంటాయి. ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వడానికి ప్రయత్నించదు. సమాజంలో గుర్తింపు వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అయితే ఇంట్లో సమస్యలు ఏర్పడితే కొన్ని రోజులపాటు ఓపికగా ఉండాలి. ఇప్పటికే ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేయాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులు సీనియర్ల మద్దతుతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని విషయాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా పనిని ప్రారంభిస్తే కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. అయితే వారితో విభేదాలు వస్తే వెంటనే విడిపోకుండా ఉండాలి. సామర్థ్యానికి మించి పనులు చేయకూడదు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవం కాపాడుకునేందుకు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. బంధువుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమయాన్ని గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . కుటుంబ సభ్యుల ఆరోగ్యానంపై దృష్టి పెట్టాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉత్సాహంతో పనులు చేయడం వల్ల కార్యాలయాల్లో అధికారుల సపోర్టు ఉంటుంది. కొన్ని విషయాల్లో వివాదాలు ఏర్పడిన వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. చాలావరకు ఓపికతో ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఈ విషయంలో మౌనంగా ఉండడమే మంచిది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఉద్యోగులు ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ముందుకు వస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే వెంటనే వెళ్లాలి. ఇవి ఆర్థికపరమైన లాభాలు తీసుకురావచ్చు.