Today 25 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి గ్రహాల అనుగ్రహం ఉండడంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు అన్ని పనులను ఒకేసారి పూర్తి చేస్తారు. దీంతో సంతృప్తిగా ఉంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే పెద్దలను సంప్రదించడం మంచిది. పెండింగ్లో ఉన్న సమస్యలను ఈరోజు పరిష్కరించుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు సానుకూలమైన ఫలితాలు ఉండడంతో ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి కూడా వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు చేసే పనులన్నింటిలోనూ విజయం చేకూరుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగుల ప్రమోషన్ గురించి అధికారులు చర్చిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు కావడానికి సమయం పడుతుంది. వీటి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా దృఢంగా ఉంటారు. ఎదుటివారిని మాటలతో ఆకట్టుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆశీర్వాదంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈరోజు అధిక లాభాలు పొందుతారు. కొత్త భాగస్వాములను చేర్చుకోవడంతో వ్యాపారంపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఉద్యోగులకు ఈరోజు సానుకూల ఫలితాలు ఉండనున్నాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు అంది అవకాశం. గతంలో చేపట్టిన ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల ప్రకటనలకు ఆకర్షితులై డబ్బులు వృధా చేసుకోరాదు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి మనసు ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు. వీరి కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి సపోర్టు ఉండటంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే పక్కవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే పెద్దలను సంప్రదిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షలో రాణిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీరు అనుకుంటున్నా పనుల్లో ఒకటి ఈరోజు నెరవేరుతుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో మానసికంగా అసంతృప్తితో ఉంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారు పెద్దలను సంప్రదించడం మంచిది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.