Balakrishna: ప్రస్తుతం బాలయ్య బాబు లైనప్ విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ డైరెక్టర్స్ సైతం తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దర్శకుల నుంచి కూడా అతనికి అవకాశాలు వస్తుండటం విశేషం…ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు బాలయ్యతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడానికి గల కారణం ఏంటి అంటే కమర్షియల్ సినిమాలను తనతో చేస్తే ఈజీగా సక్సెస్ ని సాధించొచ్చు అనే ఉద్దేశ్యంతో దర్శకులు ఉన్నారు. అందువల్లే వాళ్ళందరు భారీ విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు బాలయ్య బాబుతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు. ఇక బాలయ్య విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే బాలయ్య బాబుతో రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసిన కూడా అందులో ఎంతో కొంత వైవిధ్యాన్ని చూపించాలి. లేకపోతే మాత్రం ప్రేక్షకులు విపరీతంగా నిరాశ చెందుతారు.
తద్వారా సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవచ్చు…కొంతమంది దర్శకులు మాత్రం బాలయ్యను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు. ఏది చేసినా కూడా బాలయ్య రౌద్ర రసాన్ని చాలా అద్భుతంగా పండించగలడు.
కాబట్టి సినిమాలో ఎక్కువ శాతం రౌద్రం ఉండేలా చూసుకుంటే సినిమా తప్పకుండా సక్సెస్ ని సాధిస్తుందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం… ఇప్పటికే ఆయన లిస్ట్ లో కొరటాల శివ, వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమెడలతో పాటు తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి కూడా ఉన్నాడు.
ఇక వీళ్ళందరు అతనితో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకుడిని మెప్పించాలనే ప్రయత్నంలో వీళ్ళందరు ఉన్నారు. ఇక బాలయ్యను టాప్ రేంజ్ లో చూపిస్తారా? తద్వారా బాలయ్య బాబు రేంజ్ ను ఎలా పెంచుతారు అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన సమయమైతే ఉంది…