spot_img
Homeఆధ్యాత్మికంToday 23 May 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈ రోజు అన్నింటా విజయమే..

Today 23 May 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈ రోజు అన్నింటా విజయమే..

Today 23 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు జీవితంలో అనుకున్న పనులను పూర్తి చేసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. అకారణంగా ఎవరితో వాదనలకు దిగకుండా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు. అయితే ఇదే సమయంలో ఖర్చులు కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకున్న లాభాలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూలమైన వాతావరణఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల అవమానాలు పాలు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉన్నంత మేరకే ఖర్చులు పెట్టాలి. కొందరు మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొన్ని కారణాలతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొందరు తప్పు దోవ పట్టించే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు వెంటనే పూర్తి చేస్తారు. ఎవరితోనైనా వాదనలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు వ్యాపారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన ఆర్థిక ఫలితాలు ఉండే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. మానసికంగా నిరాశతో ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో నష్టపోయే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తిపై శుభవార్తలో వింటారు. కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు వెంటనే పూర్తి చేస్తారు. ఇంట్లో రహస్యాలు బయటకు చెప్పకపోవడమే మంచిది. పాత స్నేహితులు కలవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. ఇతరులకు దానధర్మాలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యర్థుల విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper