Today 23 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేసిన తప్పులనుంచి బయటపడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మనిషి సమయం. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఏమైనా వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు ప్రత్యర్థులతో అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే వీటి నుంచి బయటపడేందుకు ప్రత్యేక మార్గాలను ఎంచుకోవాలి. వ్యాపారులకు తోటి వారి మద్దతు ఉండడంతో ఘననీయమైన లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తూ జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం అవసరమైన వస్తువులను అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారు ఈరోజు విహారయాత్రలకు వెళ్లి అవకాశం ఉంటుంది. వ్యాపారాలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : మీ రాశి వారు ఈ రోజు దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదన వస్తాయి. విద్యారంగంలో ఉన్నవారికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికి అనవసరంగా డబ్బులు ఇవ్వకుండా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాలు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. మాటలు మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకోగలగాలి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే తీవ్రంగా కష్టపడాలి. ఇంట్లో జరిగే గొడవలకు సంయమనం పాటించడమే మంచిది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసికంగా ఆందోళన చెందుతారు. కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిగా కాకుండా ఉంటాయి. దీంతో ఆవేదన చెందుతారు. చాలా విషయాల్లో ఓపికతో వ్యవహరించడం మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పెద్దల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది.