Today 22 July 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులు ఈరోజు ప్రాజెక్టులు అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి అధికారులను ఆకట్టుకుంటారు. ఇదే సమయంలో వ్యాపారులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఇలాంటి సమయంలో వాగ్వాదాలు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రయాణంలో మౌనంగా ఉండడమే మంచిది. విద్యార్థులు కొత్తవారితో పరిచయం అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వాతావరణం కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు దానిని విజయవంతంగా పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. కష్టపడిన వారికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. వీరికి తోటి వారి మద్దతు ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతారు. అయితే పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. కుమారులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారులకు భాగస్వాములతో కొన్ని విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వారితో వాదాలకు దిగడం మంచిది కాదు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వీటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే గురువుల సహాయం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా డబ్బు ఇవ్వమని అడుగుతే ఇవ్వకుండా ఉండడమే మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు భావోద్వేగాలు పెరిగిపోతాయి. ఇంట్లో ఆడవారిని మాటలతో బాధపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండే ఆకాశముంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కొందరు కావాలని డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ప్రోత్సాహం చేస్తారు. ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. ఉద్యోగులు కొత్త ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. తోటి వారి సహాయం తీసుకోవడం మంచిది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఉద్యోగులు కొత్త కంపెనీకి మారే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అయితే సీనియర్ల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఇది విజయవంతంగా పూర్తి కావడానికి భాగస్వాముల సహకారం తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఇలా రాసి వారికి ఈరోజు అన్నీ అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. వీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటిని పరిష్కరించుకోవడానికి అధికారుల తో సంయమనం పాటించాలి. దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. దీంతో మనసు ఉల్లాసంగా మారుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ రాశి వారు ఈ రోజు లాభాలు పొందుతారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాటతో పెద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కొందరు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వారిని నమ్మకుండా ఉండాలి. ఉద్యోగులు ఏదైనా పనిని మొదలుపెడితే దానిని పూర్తి చేసే వరకు వదిలి పెట్టొద్దు. జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . కొన్ని విషయాల్లో వ్యాపారులు ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే ఆదాయం రావడంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులు సైతం అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల వాదనలకు దిగకుండా ప్రశాంతంగా పనిచేయాలి. పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించాలి. వారికి ఉన్న సందేహాలను తీర్చడం ద్వారా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఉద్యోగులు ఈరోజు కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు అదనపు ఆదాయం పెంచుకునేందుకు కొత్తవారిని తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటారు. వివాహం విషయంలో కొందరికి ప్రతిపాదనలు వస్తాయి. విద్యార్థులు కొన్ని విద్యాసంస్థల నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి కీలక సమాచారం అందుకుంటారు. దీంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . మానవ సంబంధాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. కొన్ని మాటల వల్ల సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులకు ఆదాయం పెరిగినా.. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. విద్యార్థులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొంటే తప్పకుండా విజయం సాధిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. అయితే అప్పుడే బిజినెస్ సంబంధించిన రహస్యాలను పంచుకోవద్దు. వారి గురించి పూర్తిగా తెలిసిన తర్వాతనే ముందడుగు వేయాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు సంయమనం పాటించాలి. విభేదాలను పట్టించుకోకుండా ముందుకు సాగాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.