spot_img
Homeఆధ్యాత్మికంToday 21 January 2026 Horoscope: ఈ రాశి వారికి ఈరోజు గ్రహాలు అనుకూలం.....

Today 21 January 2026 Horoscope: ఈ రాశి వారికి ఈరోజు గ్రహాలు అనుకూలం.. అన్ని విజయాలే..

Today 21 January 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : గతంలో కంటే ఇప్పుడు ఈ రాశి వారు మెరుగైన లాభాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కోర్టు సంబంధిత చిక్కుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు పదోన్నతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అయితే వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీరికి శత్రువుల విడత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పనులు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులకు అధిక ప్రయోజనాలు కలగనన్నాయి. వ్యాపారాలు కొత్త పెట్టుబడులను పెడతారు. వీరికి పెద్దల సలహా ఉంటుంది. ఉద్యోగులు చేసే పనులతో ప్రశంసలు అందుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చట్టపరమైన చిక్కులు ఉంటే వాటి నుంచి బయటపడతారు. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో ధనం నిల్వ పెరుగుతుంది. అనుకోకుండా ఆదాయం వస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : .. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా ధనం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో అనేక పనులు పూర్తవుతాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు పెద్దల సలహా ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో సమస్యలు మొదలవుతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాజు వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఉత్సాహం చూపుతారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి సలహాలు పొందుతారు. దీంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అనవసరంగా కోపాన్ని తెచ్చుకోకుండా ఉండాలి. అనుకోకుండా ధన లాభం పెరుగుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. డబ్బు వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిన అవసరం లేదు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులకు కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఏ పని చేపట్టిన ఈ రోజు విజయం సాధిస్తారు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు. ఇంట్లోకి అతిథి రావడంతో సందడిగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడంతో సంతృప్తిగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త పరిచయాలు లాభపడతాయి. చిన్న విషయాలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి కావడంతో ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడడంతో లాభాలు పొందుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper