Homeఆధ్యాత్మికంToday 20 May 2026 Horoscope: ఈ రాశుల వారి ఇంట్లోకి ఈరోజు డబ్బు ప్రవాహం..

Today 20 May 2026 Horoscope: ఈ రాశుల వారి ఇంట్లోకి ఈరోజు డబ్బు ప్రవాహం..

Today 20 May 2026 Horoscope:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి నిరుద్యోగులకు ఈరోజు అద్భుతమైన అవకాశాలు అందుతాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. పిల్లల కెరీర్ పై తల్లితండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు స్నేహితుల సలహా తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు . ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు రావడంతో వ్యాపారులు సంతోషంగా గడుపుతారు. అదనపు పెట్టుబడుల కోసం పెద్దలను సంప్రదిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు అన్ని పూర్తి చేస్తారు. దీంతో ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. స్నేహితుల మద్దతుతో అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల సపోర్టు ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు అందుతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షలో రాణించడానికి తల్లిదండ్రుల మద్దతు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు అందుతాయి. చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఊహించిన దానికంటే అధికంగా ఇంట్లోకి డబ్బు వస్తుంది. నీతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆదాయాన్ని పెంచుకునేందుకు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version